గొర్రెల పంపిణీ అవకతవకలపై ఈడీ ఫోకస్..

తెలంగాణలో గొర్రెల స్కామ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ రంగంలోకి దిగింది. 700 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో ఈడీ ఎంటరైంది. భారీగా డబ్బులు మారడం, రాజకీయ నాయకులు ప్రమేయం ఉందనే ప్రచారంతో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు ప్రారంభించనుంది.

ఈ భారీ కుంభకోణంలో కీలక నిందితులను కూడా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ రామచందర్, తలసాని ఓఎస్టీ గుండమరాజు కల్యాణ్ కుమార్ ను అరెస్టు చేశారు. ఇప్పటివరకు ఏసీబీ మొత్తం 10 మందిని అరెస్ట్ చేసింది. విదేశాల్లో ఉన్న ఇద్దరు కీలక నిందితులను అదుపులోకి తీసుకుంది. కాంట్రాక్టర్ల ద్వారా నిధులు వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేస్తుంది. అయితే తాజాగా గొర్రెల పంపిణీలో అవకతవకలపై ఈడీ మరోసారి ఫోకస్ చేసింది. పూర్తి వివరాలు ఇవ్వాలని ఎండీకి ఈడీ లేఖ అందించింది.