మీరు వైస్సార్ వారసులు ఎలా అవుతారు..? – షర్మిల

మంగళగిరిలో జరిగిన వైస్సార్ జయంతి వేడుకల్లో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఫై ఏపీసీసీ చీఫ్ షర్మిల పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘మతాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేసే బీజేపీకి వైస్సార్ బద్ద వ్యతిరేకి. ఆయన వారసులు అని చెప్పుకుంటున్న వాళ్లు, వైస్ ఆశయాలు ముందుకు తీసుకెళ్తున్నామంటున్న వాళ్లు బీజేపీతో తెరవెనుక పొత్తులు పెట్టుకున్నారు. మీరు వైస్సార్ వారసులు ఎలా అవుతారు? ఒక్కసారి ఆలోచించుకోవాలి’ అని షర్మిల హితవు పలికారు. వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్బంగా షర్మిల మాట్లాడుతూ.. ‘వైస్సార్ ను నేను ఆఖరిగా కలిసినప్పుడు ఒక మాట అన్నాడు. ఏమి కానీ నన్ను దేవుడు ఇంత వాడిని చేశాడు. ఎంతో మంది పేదలకు జీవితం ప్రసాదించే అవకాశం ఇచ్చాడు అని అన్నాడు. జలయజ్ఞం పోర్టు అయితే రాష్ట్ర అభివృద్ధి అదే అన్నారు. 2009 ఎన్నికల ఫలితాల ముందు చాలా టెన్షన్ పడ్డారు. ఓడిపోతే జలయజ్ఞం పరిస్థితి ఏమిటి అని బాధపడ్డారు. రెండోసారి గెలిచాక మళ్ళీ ప్రజల దగ్గరకు వెళ్ళాలి అనుకున్నారు. ఎన్నికలు అయ్యాక ప్రజల మధ్యకు వెళ్ళాలి అనే తొందర ఎవరికి ఉండదు. కానీ వైస్సార్ అలా కాదు. పాలనలో పథకాలు అందుతున్నాయా ? లేదా? అని చూడాలి అనుకున్నారు. రెండో సారి గెలవడం వైస్సార్ పని తీరుకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశ అభివృద్ధి అని వైస్సార్ నమ్మారు. బీజేపీ కి వైస్సార్ బద్ధ వ్యతిరేకి. బీజేపీ మతతత్వ పార్టీ. అందుకే తన జీవితంలో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈరోజు వైస్సార్ వారసుడు అని చెప్పుకొనే వాళ్ళు బీజేపీ అంట కాగుతున్నారు. తెర వెనుక పొత్తులు పెట్టుకొని వైస్సార్ ఆశయాలను తుంగలో తొక్కారు. బీజేపీ తో పొత్తులు పెట్టుకొనే వారు వైస్సార్ వారసుడు ఎలా అవుతారు అని పరోక్షంగా జగన్ ఫై విమర్శలు చేసారు.