పాలేరు నుండి వైఎస్ షర్మిల పోటీ..

ys sharmila praja prasthanam padayatra begins today

రాబోయే ఎన్నికల్లో పాలేరు నుండి బరిలోకి దిగుతున్నట్లు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రకటించారు. తెలంగాణ లో రాజన్న పాలనా తీసుకురావడమే ధ్యేమని పార్టీ పెట్టిన షర్మిల..ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ ప్రజలను కష్టాలను తెలుసుకుంటూ వారికీ దగ్గర అవుతుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో పాదయాత్ర చేసిన ఈమె..ప్రస్తుతం ఖమ్మం జిల్లలో పాదయాత్ర చేస్తున్నారు.

ఈ క్రమంలోనే నేలకొండపల్లిలో పాలేరు నియోజకవర్గ కార్యకర్తలతో వైఎస్ షర్మిల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగే స్థానం విషయమై క్లారిటీ ఇచ్చారు. పాలేరు నుంచి పోటీకి దిగబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇక నుంచి తన సొంతూరు పాలేరు అని అన్నారు. వైఎస్సార్‌టీపీ పార్టీ పతాకం పాలేరు గడ్డపై ఎగరాలన్నారు. చరిత్రలో కనీవినీ ఎరగని మెజారిటీ కోసం పని చేద్దామంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

వైస్సార్ ఫోటోతో ఎంతో మంది గెలిచారని ఆమె గుర్తు చేశారు. పాలేరు నుంచి పోటీ చేయాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉందన్నారు ఆమె. వైఎస్ఆర్ (YSR) పేరు పలికే అర్హత తనకు మాత్రమే ఉందని షర్మిలా ఈ సందర్భంగా చెప్పారు. వైఎస్ఆర్ పై ఉన్న అభిమానమే తనకు ఉన్న ఆస్తిగా ఆమె పేర్కొన్నారు. ఈ రోజు నుంచి షర్మిల ఊరు పాలేరు. వైఎస్సార్ సైనికులుగా అందరినీ ఒక తాటి మీదకు తేవాలి. ఏ కార్యక్రమం చేపట్టినా పాలేరు పుట్టిన ఇల్లు. పాలేరు నియోజక వర్గం ఒక దిశానిర్దేశం అవ్వాలి. వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు అంతా మీ వైపు చూడాలి. ముందు వరసలో పాలేరు ఉండాలి. పార్టీ అభివృద్ధిలో ఎక్కడలేనంత ముందు వరసలో ఉండాలి. ఎక్కడ అవసరం అయితే అక్కడ పోరాటం చేయాలి. ప్రజలకు మీరు ఉన్నారన్న భరోసా కల్పించాలి..’ అని వైఎస్ షర్మిల అన్నారు.