రుషికొండ ప్యాలెస్‌ ప్రజల సొమ్ముతో నిర్మించారు – షర్మిల

రుషికొండ భవన రహస్యం వీడడంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నేషనల్ వైడ్ గా ఈ భవనం గురించి మాట్లాడుకుంటున్నారు. జగన్ నిబంధనలకు విరుద్ధంగా, రూ.500 కోట్ల భారీ వ్యయంతో అత్యంత రహస్యంగా ఈ ప్యాలెస్ నిర్మించారని , 61 ఎకరాల్లో ఈ భవన సముదాయాలు నిర్మించారని, అందులో రాజసౌధాన్ని తలపించేలా ఉన్న భవనం కోసమే రూ.500 కోట్లు ఖర్చు చేశారని , రుషికొండ మీద రూ.500 కోట్లతో జగన్ కట్టుకున్న జల్సా ప్యాలెస్‌లోని రూ.26 లక్షల బాత్ టబ్ ఉందని టీడీపీ బయటపెట్టింది. దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తుంది.

తాజాగా ఈ ఇష్యూ ఫై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల స్పందించారు. రుషికొండ ప్యాలెస్‌ కోసం ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి ఉంటే అది క్షమించరాని నేరమన్నారు. రుషికొండ ప్యాలెస్‌ను ఎందుకోసం నిర్మించారో ప్రజలకు తెలియాలన్నారు. అలాగే రుషికొండ ప్యాలెస్‌ నిర్మాణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిజానిజాలు తేల్చాలన్నారు. తప్పని రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇక వైసీపీ ప్ర‌భుత్వం దాదాపు 8 లక్షల కోట్ల అప్పు చేసిందని.. విచ్చలవిడిగా ఖర్చు చేసిందని షర్మిల ఆరోపించారు.

#WATCH | Vijayawada: On the Rushikonda Palace controversy, Andhra Pradesh Congress President YS Sharmila says, “… If the people’s money has been spent on Rushikonda palace, then it is not excusable. People should know why it was used and if an enquiry is conducted into this by… pic.twitter.com/Z8683Ygb8Z— ANI (@ANI) June 19, 2024