ఎక్కడిక్కడే బీఆర్ఎస్ నేతల అరెస్ట్..

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ నివాసంలో ఈరోజు పార్టీ సమావేశానికి BRS పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిన్న కౌశిక్ ఇంటి వద్ద జరిగిన ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.

మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వారి ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బిఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులను హరీశ్ రావు ఖండించారు. ‘MLA కౌశిక్ రెడ్డి ఫై దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా, బిఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే MLA గాంధీ, ఆయన అనుచరులు, కాంగ్రెస్ గూండాలను అరెస్టు చేయాలి’ అని డిమాండ్ చేశారు. తన భుజం నొప్పిగా ఉందని..హాస్పటల్ కు వెళ్తాన్న సరే హరీష్ రావు ను ఇంటి నుండి బయటకు పంపడం లేదు. నిన్న అరెస్టు సమయంలో తన చేతికి గాయమైందని, ఆస్పత్రికి వెళ్లి చూపించుకుంటానని ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం ఆయనను హౌస్ అరెస్ట్ చేశామని, తర్వాత తామే ఆస్పత్రికి తీసుకెళ్తామని పోలీసులు తెలిపారు.

అలాగే హరీశ్‌రావును కలవడానికి వచ్చిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవితను అడ్డుకున్నారు. ఆయనను కలిసేందుకు వీల్లేదంటూ బయటే నిలిపివేశారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ ఎమ్మెల్యేను కలిసేందుకు మీ అనుమతి కావాలా, మీకు అభ్యంతరం ఎందుకు అంటూ నిలదీశారు.