Setback for YSRCP.. Chokkakula Venkata Rao resigns

YSRCP: వైసీపీకి ఎదురుదెబ్బ..చొక్కాకుల వెంకటరావు రాజీనామా

YSRCP: విశాఖపట్నంలో వైఎస్‌ఆర్‌సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, నగరానికి చెందిన సీనియర్ నేతగా ఉన్న చొక్కాకుల వెంకటరావు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. వెంకటరావు వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం రాత్రి తన రాజీనామాపై ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో తన రాజీనామా లేఖను అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి పంపినట్లు తెలిపారు.

Advertisements
వైసీపీకి ఎదురుదెబ్బ చొక్కాకుల వెంకటరావు

2013లో విశాఖ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు

చొక్కాకుల వెంకటరావు వైఎస్‌ఆర్‌సీపీ స్థాపించిన వెంటనే పార్టీలో చేరారు. 2013లో విశాఖ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనకు విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014 ఎన్నికల్లో విశాఖపట్నం ఉత్తరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి.. వైఎస్‌ఆర్‌సీపీకి అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు చేతిలో ఓడిపోయారు. 2019లో వైఎస్‌ఆర్‌సీపీకి అధికారంలోకి వచ్చాక వెంకటరావు భార్య లక్ష్మికి పదవి దక్కింది. ఆమె వీకేపీసీపీసీఐఆర్‌యూడీఏ (విశాఖపట్నం, కాకినాడ పెట్రోలియం కెమికల్‌ అండ్‌ పెట్రో కెమికల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.

ఆయన ఏదైనా పార్టీలో చేరతారా? లేదా? అన్నది చూడాలి

ఆ తర్వాత చొక్కాకుల అదే సంస్థకు ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన కొంతకాలంగా వెంకటరావు వైఎస్‌ఆర్‌సీపీకి కార్యక్రమాల్లో యాక్టివ్‌గా లేరు. ఈ మేరకు ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన ఏదైనా పార్టీలో చేరతారా? లేదా? అన్నది చూడాలి. ఆయన కూటమి పార్టీలవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన ప్రకటించాల్సి ఉంది. గతంలో ఆయన బీజేపీలో కూడా పనిచేయడంతో ఆయన ఆ పార్టీవైపు వెళతారా అనే టాక్ కూడా వినిపిస్తోంది.

Related Posts
జైపూర్ లో మంత్రి నారాయ‌ణ‌, మున్సిప‌ల్ శాఖ అధికారుల పర్య‌ట‌న‌
జైపూర్ లో మంత్రి నారాయ‌ణ‌

జైపూర్ లో మంత్రి నారాయ‌ణ‌, మున్సిప‌ల్ శాఖ అధికారుల పర్య‌ట‌న‌ జైపూర్ లో మంత్రి నారాయ‌ణ‌, మున్సిప‌ల్ శాఖ అధికారుల పర్య‌ట‌న‌ జరిగింది. 12వ ఆసియా పసిఫిక్ Read more

Tihar Jail : మరో చోటుకు తిహార్ జైలు తరలింపు
tihar jail

ఆసియాలోనే అతిపెద్దదైన తిహార్ జైలును మరో ప్రాంతానికి తరలించేందుకు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ సరిహద్దుల్లో కొత్త జైలు నిర్మాణానికి అవకాశం ఉండడంతో, ప్రభుత్వం దీనికి Read more

ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు తీపి కబురు
ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు తీపి కబురు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళా ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై, ప్రభుత్వ ఉద్యోగుల ప్రసూతి సెలవులపై ఉన్న పరిమితిని ఎత్తివేస్తున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. Read more

ఎల్ కె అద్వానీకి అస్వస్థత
LK Advani Indian politician BJP leader India 2015

భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు ఎల్ కె అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో శనివారం ఉదయం అద్వానీని ఆయన కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×