రేపు రెండో విడుత రుణమాఫీ నిధులు విడుదల..

తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు తెలిపింది. ఆగస్టు 15 లోగా ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని తెలిపినట్లే..కాంగ్రెస్ సర్కార్ ఆ మాఫీ చేస్తుంది. ఇప్పటికే లక్ష ఋణం మాఫీ చేయగా..రేపు రెండో విడుత మాఫీ చేయబోతుంది. రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసే విషయమై ఆర్థిక శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. రేపు రైతు రుణమాఫీ రెండో విడత నిధుల విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. లక్షన్నర లోపు రుణం ఉన్న రైతుల ఖాతాలోకి రేపు నిధులు పడుతాయని వెల్లడించింది.

మొదటి విడతలో లక్ష రూపాయల వరకు రుణాలు ఉన్న రైతులకు మాఫీ అవుతుందని భావించగా కొంత మంది రైతుల ఖాతాల్లో సాంకేతిక సమస్యల వల్ల అది సాధ్యం కాలేదు. రుణమాఫీ సొమ్మును రిజర్వ్‌ బ్యాంకు ఈ-కుబేర్‌ విధానంలో జమ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. మొదటి విడతలో 17 వేల 877 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 84.94 కోట్ల రూపాయలు జమ కాలేదన్నారు. ఆ నిధులు ఆర్‌బీఐ వద్దే ఉన్నాయని పేర్కొన్నారు.