హైదరాబాద్‌లో తమ గ్లోబల్ కెపాసిటీ సెంటర్ విస్తరణను ప్రకటించిన సనోఫీ

2025 నాటికి €100 మిలియన్లతో పాటుగా 2030 నాటికి €400 మిలియన్ల పెట్టుబడిని ప్రణాళిక చేసింది ; విస్తరించిన కేంద్రం 2600 మంది ఉద్యోగులకు తగిన అవకాశాలను అందిస్తుంది.హైటెక్ సిటీలో అత్యాధునిక కార్యాలయాన్ని డాక్టర్ అరుణిష్ చావ్లా (సెక్రటరీ, డిపార్ట్మెంట్ అఫ్ ఫార్మాస్యూటికల్స్) మరియు శ్రీ థియరీ బెర్థెలాట్ (బెంగళూరులో ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్)తో కలిసి గౌరవనీయ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు.

Sanofi has announced the expansion of its Global Capacity Center in Hyderabad

హైదరాబాద్ : సనోఫీ హెల్త్‌కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SHIPL) ఈరోజు హైదరాబాద్‌లోని తమ గ్లోబల్ కెపాసిటీ సెంటర్ (జిసిసి)ని విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. వచ్చే ఆరు సంవత్సరాల్లో €400 మిలియన్లు, 2025 నాటికి €100 మిలియన్ల పెట్టుబడిని దీనిలో పెట్టాలని యోచిస్తోంది. రాబోయే రెండేళ్లలో, ఈ జిసిసి (హబ్) 2600 మంది ఉద్యోగులకు అవకాశం కల్పించనుంది. తద్వారా ఇది సనోఫీ యొక్క నాలుగు గ్లోబల్ హబ్‌లలో అతిపెద్దదిగా నిలుస్తుంది. సనోఫీ యొక్క 4 గ్లోబల్ కెపాసిటీ సెంటర్‌లు ప్రపంచవ్యాప్తంగా సంస్థకు ఉన్న వ్యూహాత్మక కేంద్రాలు, ఇవి కంపెనీకి అత్యుత్తమ-శ్రేణి ఎంటర్‌ప్రైజ్ పరిష్కారాలను అందించడంలో ముందుంటాయి. ఈ కేంద్రాలు కేంద్రీకరణ మరియు ఆధునికీకరణను ప్రారంభించే కీలకమైన ‘నెర్వ్ -సెంటర్లు ‘ మరియు సనోఫీ వేల్యూ చైన్ అంతటా వృద్ధి అవకాశాలను అనుమతిస్తాయి, వాణిజ్య, తయారీ & సరఫరా నుండి ఆర్ & డి మరియు డిజిటల్ వరకు అనేక రకాల సేవలను అందిస్తాయి.

2019లో స్థాపించబడిన, హైదరాబాద్ హబ్, మెడికల్ హబ్ స్థాయి నుండి అత్యుత్తమంగా అభివృద్ధి చెందింది, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సనోఫీ యొక్క అంతర్జాతీయ కార్యకలాపాలు మరియు అనుబంధ సంస్థలకు అత్యుత్తమ-శ్రేణి సేవలను అందిస్తోంది. హైదరాబాద్‌లోని ప్రతిభావంతుల కోసం ఈ భవిష్యత్-ఆలోచనలతో కూడిన గ్లోబల్ హబ్, పర్యావరణపరంగా నిలకడగా మరియు వైవిధ్యం , సమగ్రతను పెంపొందించేలా రూపొందించబడిన అత్యాధునిక పని ప్రాంగణంగా నిలుస్తుంది. శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గౌరవనీయ మంత్రి – ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, పరిశ్రమలు & వాణిజ్యం మరియు శాసన సభ వ్యవహారాలు, తెలంగాణ
“ ప్రపంచ ఫార్మాస్యూటికల్ రంగంలో తెలంగాణకు పెరుగుతున్న ప్రాముఖ్యత కోసం ఒక అద్భుతమైన ముందడుగును హైదరాబాద్‌లో సనోఫీ యొక్క గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ విస్తరణ సూచిస్తుంది. ఈ గణనీయమైన అదనపు పెట్టుబడి 400 మిలియన్ యూరోలు మరియు రాబోయే రెండేళ్ళలో 2,600 ఉద్యోగాల కల్పన ఆవిష్కరణ మరియు అభివృద్ధి కోసం అభివృద్ధి చెందుతున్న వాతావరణాన్ని పెంపొందించడంలో తెలంగాణ యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. ఆరోగ్య సంరక్షణను మరింతగా అభివృద్ధి చేయడంలో సనోఫీ యొక్క దృక్పథానికి మద్దతు ఇస్తున్నందుకు మేము గర్విస్తున్నాము మరియు ఈ విస్తరణ మా స్థానిక ఆర్థిక వ్యవస్థకు మరియు ప్రపంచ శ్రేయస్సుకు గణనీయంగా దోహదపడుతుందని విశ్వసిస్తున్నాము..” అని అన్నారు

మడేలిన్ రోచ్ , ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ ఆపరేషన్స్, సనోఫీ “సనోఫీ యొక్క అతిపెద్ద జిసిసి ని స్వాగతించినందుకు మరియు మా కొత్త వర్క్‌ప్లేస్‌ను ప్రారంభించినందుకు గౌరవ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అత్యధిక సంఖ్యలో ప్రతిభావంతులను కలిగిన హైదరాబాద్, ఎక్కువమంది ఇష్టపడే భాగస్వామ్య సేవల గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతోంది. డిజిటలైజేషన్‌ మా పరివర్తనకు అత్యంత కీలకం కావటంతో డిజిటలైజేషన్‌తో అత్యుత్తమ ప్రపంచ కమ్యూనిటీగా మారేందుకు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి మరియు ఈ హబ్‌ని నిర్మించడానికి మేము సంతోషిస్తున్నాము. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు సైన్స్ అద్భుతాలను ఆవిష్కరిస్తున్న వేళ, సనోఫీ సామర్థ్యాన్ని వేగవంతం చేయడానికి మరియు మనం ఎలా పని చేస్తున్నామో మళ్లీ ఆవిష్కరించడానికి ఈ హబ్ ఒక ఉత్ప్రేరకం అవుతుంది” అని అన్నారు. ఇమ్మాన్యుయేల్ ఫ్రెనెహార్డ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ డిజిటల్ ఆఫీసర్, సనోఫీ “ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో నడిచే మొదటి బయోఫార్మా కంపెనీ కావాలన్నది మా ఆశయం. ఆవిష్కరణ నుండి చికిత్స వరకు, మేము ఏఐ ను నైతికంగా మరియు సురక్షితంగా ఉపయోగించటం ద్వారా , మా మందులతో వేగంగా మార్కెట్‌కి వెళ్లగలుగుతున్నాము. శాస్త్రీయ ఆవిష్కరణల వేగాన్ని ఉపయోగించుకోవడానికి, మా ఉత్పాదకతను మెరుగుపరచడానికి మరియు మా ఉద్యోగుల చేతుల్లో మెరుగైన నిర్ణయాత్మక మేధస్సును ఉంచడానికి మా వేల్యూ చైన్ అంతటా ఏఐ యొక్క శక్తిని స్వీకరించడానికి హైదరాబాద్ హబ్‌లో ప్రతిభను ఆన్‌బోర్డ్ చేయాలని మేము భావిస్తున్నాము… ” అని అన్నారు.