SKV firstweek

వెంకీమామ ఏంటి ఈ రికార్డ్స్ …సంక్రాంతి మొత్తం నీదే..!

వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఫామిలీ & యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా సంక్రాంతికి కానుకగా జనవరి 14 తేదీన రిలీజ్ అయ్యింది. విడుదలకు ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం, విడుదల తర్వాత కూడా అదే టాక్ రావడంతో సినిమాను చూసేందుకు సినీ లవర్స్ పోటీ పడుతున్నారు. మొదటినుండి కూడా వెంకీ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం తో ఫ్యామిలీ ఆడియన్స్ తో హౌస్ ఫుల్ అవుతుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది.

విడుదలైన తొలి వారం రోజుల్లోనే రూ.203 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ప్రాంతీయ సినిమాల్లో ఇదే ఆల్ టైమ్ రికార్డు అని పేర్కొంది. కాగా వెంకటేశ్ ఇప్పటివరకు నటించిన సినిమాల్లో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు వచ్చిన చిత్రం ఇదే. ఇలా వరుస రికార్డ్స్ బ్రేక్ చేస్తుండడం తో అభిమానులు వెంకీమామ ఏంటి ఈ రికార్డ్స్…సంక్రాంతి సీజన్ మొత్తం నీదేనా అంటూ ఫన్నీ గా కామెంట్స్ చేస్తున్నారు.

Related Posts
Telangana CS : తెలంగాణ తదుపరి CSగా రామకృష్ణారావు?
ramakrishnarao

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా (CS) కె. రామకృష్ణారావును నియమించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుత సీఎస్ శాంతికుమారి పదవీకాలం ఈ ఏప్రిల్‌లో ముగియనున్న నేపథ్యంలో, కొత్త Read more

తెలంగాణ రాజ్ భవన్ లో ఎట్ హోం
Telangana Raj Bhavan

గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాజ్ భవన్‌లో "ఎట్ హోం" కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తన ఆధ్వర్యంలో తేనీటి విందును నిర్వహించారు. Read more

థియేటర్స్ లోకి మళ్లీ ‘అతిధి’
athidhi re release

మహేశ్ బాబు అభిమానులకు మరోసారి పండగ చేసుకునే సందర్భం రాబోతోంది. 2007లో విడుదలైన 'అతిథి' చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరి 14న మళ్లీ Read more

ప్రతి సవాలు మన ధైర్యాన్ని పెంచుతుంది – గౌతమ్ అదానీ
adani 1

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నేడు, అమెరికా ప్రభుత్వ దర్యాప్తును ఎదుర్కొన్న విషయం పై స్పందించారు. ఈ వివాదం ఆ సంస్థకు కొత్తది కాదని ఆయన Read more