IPL2025 :రిషబ్ పంత్‌కు సంజీవ్ గోయెంకా హెచ్చరిక.. ఎందుకంటే!

IPL2025 :రిషబ్ పంత్‌కు సంజీవ్ గోయెంకా హెచ్చరిక.. ఎందుకంటే!

ఐపీఎల్ 2025 సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్ జి) ఒక వికెట్ తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ పూర్తిగా లక్నో చేతి లోనే ఉన్నా, చివరి ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అశుతోష్ శర్మ సిక్సర్ కొట్టి ఢిల్లీకి విజయాన్ని అందించాడు. దీంతో లక్నో ఓటమిని తప్పించుకోలేకపోయింది.

Advertisements

సంజీవ్ గోయెంకా-రిషబ్ పంత్

లక్నో ఓటమి అనంతరం ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ రిషబ్ పంత్ తో కలిసి మైదానంలో కనిపించాడు. వారితో పాటు లక్నో కోచ్ జస్టిస్ లాంగర్ కూడా అక్కడ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో రిషబ్ పంత్ కు సంజీవ్ గోయెంకా వార్నింగ్ ఇచ్చినట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పంత్-గోయెంకా ఫోటోలు పెట్టి రిషబ్ పంత్ కు స్టార్ట్ అయ్యిందంటూ ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు. లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా దగ్గరకు ఏ కెప్టెన్ వెళ్లినా అవమానం ఎదుర్కొంటారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మెగా వేలం

ఐపీఎల్ 2025 మెగా వేలంలో, లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్‌ను ఏకంగా రూ.27 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు.అయితే, ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తన తొలి ప్రదర్శనను మరిచిపోలేనిదిగా మార్చుకున్నాడు.6 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు.కెప్టెన్సీలోనూ కొన్ని తప్పులు చేశాడు.చివరి ఓవర్‌లో మోహిత్ శర్మ స్టంపింగ్‌ను మిస్ చేశాడు.ఈ కారణంగా సంజీవ్ గోయెంకా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు, పంత్‌తో సీరియస్‌గా మాట్లాడినట్లు వీడియోలో కనిపిస్తోంది.

కేఎల్ రాహుల్‌

ఐపీఎల్ 2024లో కూడా సంజీవ్ గోయెంకా అప్పటి కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను ఓటమి అనంతరం అందరి ముందు దురుసుగా మందలించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమి తర్వాత, గోయెంకా మైదానంలోకి వచ్చి కేఎల్ రాహుల్‌ను తిట్టిన వీడియో వైరల్ అయింది. ఆ ఘటన అనంతరం రాహుల్ లక్నో జట్టును వదిలి పెట్టాడు.ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు కేఎల్ రాహుల్ లక్నో జట్టు నుంచి బయటకు వచ్చేశాడు. ప్రస్తుతం అతను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భాగంగా ఉన్నాడు.

లక్నో జట్టు తదుపరి మ్యాచ్

ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ తమ తదుపరి మ్యాచ్ మార్చి 27న సన్ రైజర్స్ హైదరాబాద్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ తన ప్రతిభను నిరూపించుకుంటాడా, లేదా అతనిపై ఒత్తిడి ఇంకా పెరుగుతుందా అన్నది ఆసక్తిగా మారింది.

Related Posts
అక్రమ వలసదారుల తరలింపులపై ప్రతిపక్షాల ఫైర్
flight

అమెరికాలో నివసించే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోన్నారు. కరడుగట్టిన నేరస్తులతో సమానంగా భావిస్తోన్నారు. ఈ విషయంలో భారత్ కూడా Read more

కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గింపు
Commercial LPG cylinder prices reduced

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. న్యూ ఇయర్ కానుకగా ఊరట కలిగించే శుభవార్త వచ్చింది. చమురు మార్కెటింగ్ సంస్థలు జనవరి 1, 2025న Read more

Rishabh Pant: రెండో టెస్టులో రిషబ్ పంత్ ఆడడా?.. తెరపైకి ఆసక్తికర విషయం
Rishabh Pant 1

బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయపడిన విషయం క్రికెట్ ప్రపంచానికి తెలిసిందే పంత్‌కు Read more

విమాన ప్రయాణం అంటే వణికిపోతున్న ప్రయాణికులు
flight threat

నెల రోజుల క్రితం వరకు విమాన ప్రయాణం అంటే తెగ సంబరపడి ప్రయాణికులు..ఇప్పుడు విమాన ప్రయాణం అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సి పరిస్థితి ఏర్పడింది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×