నేటి నుంచి ఏపీలో ఇసుక ఆన్లైన్ బుకింగ్

ఈరోజు నుంచి ఏపీలో ఇసుక ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. వినియోగదారులు ఉచిత ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేలా బుధవారం నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్‌ ఏర్పాటు చేసింది. ఏపీ శాండ్‌ పోర్టల్‌ పేరిట నిర్వహించే సైట్‌ ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది. సైట్‌ నిర్వాహకులు, ఫిర్యాదులు స్వీకరించేవారికి శిక్షణ కార్యక్రమాలు కొలిక్కి వస్తున్నాయి. పోర్టల్‌ పరీక్ష దశలోనే బుధవారం నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేపట్టనున్నట్లు తెలిసింది. ఈ విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి రావడానికి ఐదారు రోజులు పట్టొచ్చని అధికార వర్గాలు తెలిపాయి.

గత ప్రభుత్వం విధించిన దానికంటే 30 నుంచి 50 శాతం ఛార్జీలు పెంచాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం మొత్తం ఒకే ధరలు ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. 4.5 టన్నుల ఇసుక ట్రాక్టర్కు తొలి 10 కి.మీకు రూ.547 వసూలు చేయనున్నట్లు సమాచారం.