Samantha: మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపై మళ్లీ స్పందించిన సమంత

samanthasurekha

టాలీవుడ్ నటి సమంత ఇటీవల తెలంగాణ మంత్రి కొండా సురేఖ తన గురించి చేసిన వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు ఆమె తన చుట్టూ ఉన్నవారి నమ్మకం వల్లే తాను తన జీవితంలో ఎదురైన అన్ని సమస్యలను అధిగమించగలిగానని అన్నారు ఈ విషయంపై తన తాజా వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్ని ప్రమోషన్‌లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఇంటర్వ్యూలో ఒక విలేకరి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా సమంత తనకు అందుతున్న మద్దతు గురించి ప్రస్తావిస్తూ తాను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక తన మీద ఉన్న ప్రేమ నమ్మకమే ప్రధాన కారణమని తెలిపారు ఇండస్ట్రీలోని ప్రముఖులు తనకు అండగా ఉన్నందుకు వారి మద్దతు లేకపోయి ఉంటే తాను ఎదుర్కొన్న సమస్యలు ఇంకా ఎక్కువ కాలం కొనసాగేదని ఆమె పేర్కొన్నారు ఆన్‌లైన్ ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ ద్వేషపూరిత సందేశాలు వచ్చినప్పుడు వాటి ప్రభావం తనపై పడకుండా చూసుకుంటానని నెగటివిటీకి లొంగకుండా ముందుకు సాగుతానని వివరించారు

అలాగే సమంత సిటాడెల్ సిరీస్‌కి సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు ఈ సిరీస్‌లో తనకు పాత్ర అందించిన దర్శకులు రాజ్ అండ్ డీకే మొదట తనను సంప్రదించగా తాను ఆ పాత్ర చేయలేనని వారి ముందు చెప్పానని గుర్తు చేశారు ఆమె వారిని నలుగురు ఇతర హీరోయిన్ల పేర్లు సిఫార్సు చేసినా వారు వినకపోవడంతో చివరికి తనే ఆ పాత్రను చేయవలసి వచ్చిందని చెప్పారు. తాను చివరికి ఆ పాత్ర చేయడం తన అదృష్టమని ఆమె అభిప్రాయపడ్డారు సమంత ఈ సిరీస్‌లో స్పై ఏజెంట్ పాత్రలో నటించగా ఆమెతో పాటు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కీలక పాత్రలో నటించారు ఈ సిరీస్‌ త్వరలో ఈ సంవత్సరం నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Latest sport news. 画ニュース.