రూ.42 కోట్ల వాచ్ ధరించిన సల్మాన్ ఖాన్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అత్యంత ఖరీదైన వాచ్ ధరించిన వీడియో వైరలవుతోంది. కేవలం సినిమాలే కాకుండా వ్యాపార రంగంలో.. యాడ్స్ లో సల్మాన్ సంపాదన ఎక్కువే ఉంటుంది. ఇప్పటివరకు సల్మాన్ కార్స్ కలెక్షన్స్, ముంబైలో అతని నివాసంకు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అలాగే సల్మాన్ కు లగ్జరీ వాచ్ లు అంటే చాలా ఇష్టం. తన జీవితంలో ఎన్నో ఉత్తమమైన.. లగ్జరీ గడియారాలను ధరించాడు. తాజాగా సల్మాన్ ఖాన్ కొత్త డైమండ్ వాచ్ గురించి అంత మాట్లాడుకుంటున్నారు.

అమెరికన్ జువెలరీ, లగ్జరీ వాచ్ డిజైనర్ జాకబ్ అరబో, సల్మాన్ వాచ్ తొడిగి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ ‘బిలియనీర్’ వాచ్లో 714 డైమండ్స్ ఉన్నాయి. దీని విలువ సుమారు రూ.42 కోట్లు. కాగా ఈ వాచ్ను ట్రై చేసేందుకు ఎవరికీ అనుమతించలేదని, సల్మాన్ కాబట్టి తానే స్వయంగా తొడిగానని జాకబ్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.