sajjala

నేడు పోలీసుల విచారణకు హాజరుకానున్న సజ్జల..

అమరావతి: వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఈరోజు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో సాయంత్రం 4 గంటలకు డీఎస్పీ ఆఫీసులో విచారణకు సజ్జల రానున్నారు. దాడి ఘటనలో ప్రమేయం ఉన్న ముఖ్య నాయకులను విచారించే క్రమంలో సజ్జలకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసును ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.

ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను విచారించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌తోపాటు మరికొందరు వైసీపీ నేతలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ ఘటన వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయనపై ఇప్పటికే లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఇదే కేసులో వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్‌లను పలుమార్లు విచారించారు.

Related Posts
తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ: సిఎం
తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ: సిఎం

తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా, దాదాపు 40 మంది గాయపడిన సంఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు న్యాయ విచారణను ఆదేశించారు. ఈ ఘటన Read more

ప్రముఖ నటుడు ముస్తాక్ ఖాన్ కిడ్నాప్
Mushtaq Khan kidnap

ప్రముఖ నటుడు ముస్తాక్ ఖాన్ కిడ్నాప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 'స్త్రీ-2', 'వెల్కమ్' వంటి చిత్రాల్లో తన నటనతో గుర్తింపు పొందిన ఆయనను దుండగులు గతనెల Read more

మాజీ మంత్రి హరీష్‌రావు అరెస్ట్
harish rao arrest

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్‌రావును హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. గురువారం ఉదయం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు Read more

బ్యాంకులో రూ. 1.70 కోట్ల నగలు మాయం
gold fruad

మచిలీపట్నంలోని కర్ణాటక బ్యాంకు లో భారీ మోసం జరిగినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ బ్యాంకులో శుక్రవారం గోల్డ్ స్థానంలో రోల్డ్ గోల్డ్ నగలు పెట్టి, రూ. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *