బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇటీవల కత్తిపోట్లకు గురై తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ముంబైలోని లీలావతి ఆసుపత్రి నుంచి ఆయన ఇటీవల డిశ్చార్జ్ అయ్యారు. అయితే, ఆయన ఆసుపత్రి బిల్ రూ. 40 లక్షలకుపైగా ఉందని సమాచారం. ఈ భారీ బిల్‌లో ఇన్సూరెన్స్ కంపెనీ రూ. 25 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది.
సైఫ్ చికిత్సకు రోజుకు రూ. 7 లక్షలకుపైగా ఆసుపత్రి యాజమాన్యం వసూలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గాయాల తీవ్రత, అధునాతన వైద్యం, ప్రత్యేకసేవలు అన్నీ కలిపి ఈ ఖర్చు పెరిగినట్లు అర్థమవుతోంది. ఆసుపత్రి బిల్ గురించి తెలుసుకున్న నెటిజన్లు, సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
మరోవైపు సైఫ్‌ను కత్తిపోట్ల నుంచి రక్షించిన ఆటో డ్రైవర్‌కు ఒక సంస్థ రూ. 11 వేల రివార్డు ప్రకటించింది. ఆ డ్రైవర్ సైఫ్‌ను సమయానికి ఆసుపత్రికి చేర్చడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆ డ్రైవర్‌కు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.