గత కొన్ని రోజులుగా కత్తిపోట్లకు గురై కోలుకుంటున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు మరో భారీ షాక్ తగిలింది.సైఫ్ కుటుంబానికి చెందిన రూ. 15 వేల కోట్ల విలువైన ఆస్తులు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి స్వాధీనం కానున్నాయి. ఈ ఆస్తులు భోపాల్‌లో ఉన్నాయి.సైఫ్ అలీ ఖాన్ పటౌడీ రాజవంశానికి చెందిన వ్యక్తి అని అందరికీ తెలిసిందే.ఆయన ముత్తమ్మమ్మ అబీదా సుల్తాన్ 1947లో భారతదేశ విభజన సమయంలో పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు, తన ఆస్తులను అక్కడ వదిలి వేదికైనారు.అప్పటి భారత ప్రభుత్వం, దేశాన్ని వదిలి పాకిస్థాన్‌కు వెళ్లిపోయిన వారి ఆస్తులు “ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968” కింద వస్తాయని ప్రకటించింది.ఆ ఆస్తుల విలువ ప్రస్తుతం రూ. 15 వేల కోట్లుగా ఉంటుంది.2014లో సైఫ్‌కు సమస్యలు మొదలయ్యాయి. ఆ ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా ప్రకటిస్తూ,ఎనిమీ ప్రాపర్టీ డిపార్ట్‌మెంట్ నోటీసులు జారీ చేసింది. “ఎనిమీ చట్టం” ప్రకారం ఆ ఆస్తి మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి చెందుతుంది.అయితే, సైఫ్ దీనిని తమ వారసత్వ ఆస్తిగా భావించి, మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

తనకు ఆ ఆస్తిపై పూర్తిగా హక్కులు ఉన్నాయని తెలిపారు.హైకోర్టు ఆ పిటిషన్‌ను విచారించి స్టే ఇచ్చింది. కానీ, 2024 డిసెంబర్ 13న ఆ స్టేను ఎత్తివేసింది.హైకోర్టు సైఫ్ యొక్క పిటిషన్‌ను కొట్టివేసింది.అయితే, 30 రోజుల్లోపు అప్పీల్ ట్రైబ్యునల్‌లో అప్పీల్ చేయొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.అయితే, కోర్టు ఉత్తర్వులపై సైఫ్ కుటుంబం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో, రూ.15 వేల కోట్ల ఆస్తి మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి దక్కబోతుంది. ఆ ఆస్తిని స్వాధీనం చేసుకునే ప్రక్రియలు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించినట్టు సమాచారం.ఈ నేపథ్యంలో సైఫ్ అలీ ఖాన్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా? లేక ఆ ఆస్తిని వదిలేస్తారా? అనేది త్వరలో తేలిపోవాలి.