saddula bathukamma

చివరి అంకానికి చేరుకున్న ‘బతుకమ్మ’

బతుకమ్మ పండుగ చివరి అంకానికి చేరింది. చివరిదైన తొమ్మిదో రోజును సద్దుల బతుకమ్మగా నిర్వహిస్తారు. ఈరోజు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చుతారు. గౌరమ్మకు నువ్వులు, పెసర్లు, వేరుశెనగలు, బియ్యంతో చేసిన సత్తుపిండి, పెరుగన్నం, పులిహోరని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పిస్తారు. మహిళలంతా ఆడిపాడిన తర్వాత బతుకమ్మను కాలువల్లో, కుంటల్లో, చెరువుల్లో నిమజ్జనం చేస్తారు.

సద్దుల బతుకమ్మ అన్నింటి కంటే చాలా విభిన్నంగా ఉంటుంది. ఎనిమిది రోజులతో పోలిస్తే తొమ్మిదో రోజు పేర్చే బతుకమ్మ చాలా పెద్దదిగా ఉంటుంది. ఇదే రోజు దుర్గాష్టమి పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది అష్టమి, నవమి ఒకే రోజు వచ్చాయి. సద్దుల బతుకమ్మ రోజు ఎన్ని రకాల పూలు దొరికితే అన్ని రకాల పూలు అమర్చుకుంటూ ఎత్తైన బతుకమ్మ తయారు చేస్తారు. అలాగే పెద్ద బతుకమ్మతో పాటు చిన్న బతుకమ్మ కూడా పెట్టుకుంటారు. పసుపుతో గౌరీ దేవిని చేసి పూజిస్తారు. అమ్మవారిని పూజించిన తర్వాత పసుపు తీసుకుని మహిళలు ఒకరికొకరు రాసుకుంటారు.

తొమ్మిదో రోజు సాగే సద్దుల బతుకమ్మ చూసేందుకు ఊరు వాడ అంతా ఒక చోటుకు చేరతారు. మహిళలు అందరూ ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ప్రకృతిలో దొరికే పూలు అన్నింటినీ తెచ్చుకుంటారు. తాంబూలం పళ్ళెం తీసుకుని అందులో అన్ని రంగుల పూలను వరుసలుగా పేర్చుకుంటూ ఉంటారు. కొందరు వలయాకారంలో పెడితే మరికొందరు గోపురం, స్తూపం ఆకారంలో అమర్చుకుంటారు. గునుగు పూలకు రంగులు అద్ది వాటిని ఉపయోగిస్తారు.

Related Posts
భగవద్గీత: ధర్మాన్ని అనుసరించడమే జీవితం యొక్క అసలు ఉద్దేశ్యం
bhagavad gita

హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన గ్రంథాలలో భగవద్గీత ఒకటి. భగవద్గీత, మహాభారత ఇతిహాసంలో భీష్మ పర్వం 25వ అధ్యాయంనుంచి 42వ అధ్యాయం వరకు 18 అధ్యాయాలను కలిగి Read more

Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు
tirumala

వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తుండడంతో ఆ ప్రాంతాలు ప్రభావితమవుతున్నాయి. ముఖ్యంగా తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడటంతో Read more

ఏపీలో రాబోయే భవిష్యత్ అంతా వైసీపీదే : పార్టీ నేతలు
Future of AP belongs to YCP.. party leaders

అమరావతి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి అధ్యక్షతన వైసీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో వైసీపీ పార్టీ నేతలు Read more

ఆసియాలో రెండవ అతిపెద్ద ఇస్కాన్ ఆలయం రెడీ..
ఆసియాలో రెండవ అతిపెద్ద ఇస్కాన్ ఆలయం రెడీ..

ఖార్ఘర్, నవీ ముంబైలో గత 12 ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న ఇస్కాన్ ఆలయం చివరకు పూర్తయ్యింది. 9 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ ఆలయం, ఇప్పుడు ఆసియాలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *