అమెరికా నుంచి అక్రమంగా వలస వచ్చిన భారతీయుల బహిష్కరణ అంశం పార్లమెంటులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ రాజ్యసభలో మాట్లాడుతూ, అమెరికా నుండి బహిష్కరించబడిన భారతీయులు ఎలాంటి దుర్వినియోగానికి గురికాకుండా చూసేందుకు భారత్ అక్కడి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోందని స్పష్టం చేశారు.
అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు వారి ప్రామాణిక విధానంలో భాగమని ఆయన తెలిపారు. అయితే, ప్రతిపక్షాలు ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించాయి. కాంగ్రెస్ సభ్యుడు కె.సి. వేణుగోపాల్ సహా పలువురు ప్రతిపక్ష ఎంపీలు భారతీయ వలసదారుల హక్కుల పరిరక్షణ కోసం పార్లమెంటు ఆవరణలో చేతులకు సంకెళ్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
బుధవారం, అమెరికా ప్రభుత్వం 104 మంది భారతీయ పౌరులను బహిష్కరించి, ప్రత్యేక విమానంలో అమృత్‌సర్‌కు పంపించింది. వీరిలో ఎక్కువ మంది పంజాబ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించారు. ప్రయాణమంతా చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేసి ఉంచారని బాధితులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోను అమెరికా బోర్డర్ పెట్రోల్ (USBP) చీఫ్ మైఖేల్ బ్యాంక్స్ విడుదల చేయడం వివాదాస్పదమైంది.
ఈ పరిణామాల నేపథ్యంలో, లోక్‌సభ, రాజ్యసభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలుపగా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ అంశంపై మాట్లాడుతూ, ఇది విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందని తెలిపారు. అయితే, ప్రతిపక్షాలు తమ నిరసనను కొనసాగించడంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు.
ఇదే అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ ఎంపీ కె.సి. వేణుగోపాల్ లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భారత ప్రభుత్వం ఈ అంశంపై అమెరికాతో తీసుకుంటున్న దౌత్యపరమైన చర్యలను వివరించాలని ఆయన కోరారు. జైశంకర్ మాట్లాడుతూ, పురుషులకు చేతికి సంకెళ్లు వేసి బంధించారని ధృవీకరిస్తూ, మహిళలు, పిల్లలను అలా చేయలేదని తెలిపారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) 2012 నుండి అమలు చేస్తున్న SOP ప్రకారం, భద్రతా కారణాల వాళ్ళ ఇలాంటి చర్యలు తీసుకుంటారని వివరించారు.
104 మంది భారతీయ పౌరుల బహిష్కరణపై ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేయడంతో లోక్‌సభ మరియు రాజ్యసభ రెండింటిలోనూ కార్యకలాపాలు అంతరాయం కలిగింది.లోక్‌సభలో, ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ సభలో నిరసన తెలిపారు, స్పీకర్ ఓం బిర్లా “ప్రణాళికాబద్ధమైన అంతరాయాలకు” పాల్పడవద్దని వారికి విజ్ఞప్తి చేశారు.”మీ విషయం ప్రభుత్వంలో ఉంది. ఇది విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించినది. ఈ విషయం వేరే దేశానికి సంబంధించినది.
ప్రభుత్వం దీనిని పరిగణనలోకి తీసుకుంది” అని ఓం బిర్లా అన్నారు. అయితే, ఎంపీలు తమ నిరసనలను కొనసాగించారు, దీనితో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.అంతకుముందు, ఈ అంశంపై చర్చించడానికి కెసి వేణుగోపాల్ లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. డొనాల్డ్ ట్రంప్ పరిపాలనతో చర్చలు జరపడానికి తీసుకుంటున్న దౌత్యపరమైన చర్యలను వివరించాలని ఈ తీర్మానం కేంద్రాన్ని కోరింది.