హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం రూ.569 కోట్ల రైతు భరోసా విడుదల చేసింది. మొత్తం 32 జిల్లాల్లో 563 గ్రామాలలో 4,41,911 మంది రైతులకు ఎకరానికి రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. 26వ తేదీన బ్యాంకులకు సెలవు దినం కావటంతో 27వ తేదీ ఉదయం నుంచి ఈ రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఒక్క రోజులోనే మొత్తం రూ.569 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసింది. మొదటి రోజునే 9,48,333 ఎకరాల విస్తీర్ణంలోని భూమికి రైతు భరోసాను చెల్లించింది.
Advertisements
తొలి రోజున దాదాపు 18180 వేల వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఈ నగదు సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకానికి తొలి రోజునే ఆర్థిక శాఖ రూ.10.91 కోట్లు విడుదల చేసింది. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. మొదటి విడతగా రూ.6 వేలు చెల్లించింది.
జిల్లాల వారిగా విడుదలైన రైతుభరోసా నిధుల..
ఆదిలాబాద్ జిల్లా: 17 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 6,411 మంది రైతులకు రూ.14.49 కోట్లు.. భద్రాద్రి కొత్తగూడం జిల్లా: 23 మండలాల్లోని 25 గ్రామాలకు చెందిన 22,242 మంది రైతులకు రూ.39.07 కోట్లు.. హన్మకొండ జిల్లా: 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 12,545 మంది రైతులకు రూ.14.30 కోట్లు.. జగిత్యాల జిల్లా: 20 మండలాల్లోని 20 గ్రామాలకు చెందిన 22,242 మంది రైతులకు రూ.39.07 కోట్లు.. జనగామ జిల్లా: 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 12,320 మంది రైతులకు రూ.15.91 కోట్లు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా: 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 7,073 మంది రైతులకు రూ.8.67 కోట్లు.. జోగులాంబ గద్వాల జిల్లా: 13 మండలాల్లోని 13 గ్రామాలకు చెందిన 7,829 మంది రైతులకు రూ.12.47 కోట్లు.. కామారెడ్డి జిల్లా: 22 మండలాల్లోని 24 గ్రామాలకు చెందిన 9,062 మంది రైతులకు రూ.8.35 కోట్లు.. కరీంనగర్ జిల్లా: 15 మండలాల్లోని 15 గ్రామాలకు చెందిన 14,226 మంది రైతులకు రూ.15.96 కోట్లు.. ఖమ్మం జిల్లా: 21 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 20,802 రైతులకు రూ.28.42 కోట్లు.. కోమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: 15 మండలాల్లోని 19 గ్రామాలకు చెందిన 4,344 మంది రైతులకు రూ.8.62 కోట్లు.. మహబూబాబాద్ జిల్లా: 18 మండలాల్లోని 19 గ్రామాలకు చెందిన 14,611 మంది రైతులకు రూ.18.14 కోట్లు.. మహబూబ్ నగర్ జిల్లా: 16 మండలాల్లోని 16 గ్రామాలకు చెందిన 14,575 మంది రైతులకు రూ.17.27 కోట్లు.. మంచిర్యాల జిల్లా: 16 మండలాల్లోని 17 గ్రామాలకు చెందిన 7,143 మంది రైతులకు రూ.8.72 కోట్లు.. మెదక్ జిల్లా: 21 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 14,833 మంది రైతులకు 14.06 కోట్లు.. మేడ్చల్ జిల్లా: 5 మండలాల్లోని 5 గ్రామాలకు చెందిన 2,706 మంది రైతులకు రూ.3.14 కోట్లు.. ములుగు జిల్లా: 9 మండలాల్లోని 9 గ్రామాలకు చెందిన 6,678 రైతులకు రూ.8.26 కోట్లు.. నాగర్ కర్నూల్ జిల్లా: 20 మండలాల్లోని 20 గ్రామాలకు చెందిన 16,806 మంది రైతులకు రూ.23.05 కోట్లు.. నల్లగొండ జిల్లా: 31 మండలాల్లోని 31 గ్రామాలకు చెందిన 35,568 మంది రైతులకు రూ.46.93 కోట్లు.. నారాయణపేట జిల్లా: 13 మండలాల్లోని 13 గ్రామాలకు చెందిన 9,348 మంది రైతులకు రూ.13.87 కోట్లు.. నిర్మల్ జిల్లా: 18 మండలాల్లోని 18 గ్రామాలకు చెందిన 7,912 మంది రైతులకు రూ.10.56 కోట్లు.. నిజామాబాద్ జిల్లా: 31 మండలాల్లోని 31 గ్రామాలకు చెందిన 35,568 మంది రైతులకు రూ.46.93 కోట్లు.. పెద్దపల్లి జిల్లా: 13 మండలాల్లోని 13 గ్రామాలకు చెందిన 9,885 మంది రైతులకు రూ.10.14 కోట్లు.. రాజన్న సిరిసిల్ల జిల్లా: 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 9,724 మంది రైతులకు రూ.12.26 కోట్లు.. రంగారెడ్డి జిల్లా: 21 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 15,597 మంది రైతులకు రూ.20.32 కోట్లు.. సంగారెడ్డి జిల్లా: 25 మండలాల్లోని 25 గ్రామాలకు చెందిన 19,933 మంది రైతులకు రూ.24.15 కోట్లు.. సిద్దిపేట జిల్లా: 26 మండలాల్లోని 26 గ్రామాలకు చెందిన 31,170 మంది రైతులకు రూ.36.76 కోట్లు సూర్యాపేట జిల్లా: 23 మండలాల్లోని 23 గ్రామాలకు చెందిన 29,352 మంది రైతులకు రూ.37.84 కోట్లు.. వికారాబాద్ జిల్లా: 20 మండలాల్లోని 20 గ్రామాలకు చెందిన 8,609 మంది రైతులకు రూ.11.18 కోట్లు.. వనపర్తి జిల్లా: 15 మండలాల్లోని 15 గ్రామాలకు చెందిన 9,441 మంది రైతులకు రూ.12.25 కోట్లు.. వరంగల్ జిల్లా: 11 మండలాల్లోని 11 గ్రామాలకు చెందిన 11,386 మంది రైతులకు రూ.12.86 కోట్లు.. యాదాద్రి భువనగిరి జిల్లా: 17 మండలాల్లోని 17 గ్రామాలకు చెందిన 17,576 మంది రైతులకు రూ.26.95 కోట్లు..
భారత్-అమెరికా సంబంధాలకు ముప్పు భారత పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ (Adani Group) పై కొనసాగుతున్న లంచం కేసు కొత్త మలుపు తిరిగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు Read more
కంగ్రాచ్యులేషన్స్ టీమిండియా: పవన్ కల్యాణ్ స్పందన భారత క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలుచుకుని మరోసారి చరిత్ర సృష్టించింది. ఈ విజయంపై దేశవ్యాప్తంగా అభినందనల Read more
కర్మ ఫలం ఎవర్ని వదిలిపెట్టదని..ఎప్పుడు.. ఎలా జరగాలో అదే జరుగుతుందని..ఈ విషయంలో రఘురామకృష్ణం రాజే ఉదాహరణ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గురువారం ఏపీ Read more
పిటిషన్‌ను గోప్యంగా ఉంచాలని ఫిర్యాదుదారుని ఆదేశించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: హైకోర్టు జడ్జిలను విచారించే అధికారం తమకు ఉందంటూ లోక్‌పాల్ జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. Read more