22 మంది ప్రయాణికులతో వెళ్తున్న రష్యా హెలికప్టర్‌ గల్లంతు..!

Russian helicopter carrying 22 passengers goes missing..!

న్యూఢిల్లీ : రష్యాలో ఓ హెలికాప్టర్ మిస్సైంది. రష్యన్ ఫార్ ఈస్ట్లోని కమ్చట్కా ద్వీపకల్పంలో 22 మందితో ప్రయాణిస్తున్న రష్యన్ Mi8 శ్రేణికి చెందిన హెలికాప్టర్ అదృశ్యమైనట్లు రష్యా ప్రభుత్వ మీడియా తెలిపింది. 22 మందిలో 19 మంది ప్రయాణికులు కాగా, మరో ముగ్గరు సిబ్బంది. ఈ విషయాన్ని ఫెడరల్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ కూడా ధ్రువీకరించింది. మిస్సైన హెలికాప్టర్ ద్వీపకల్పంలో పర్యాటక యాత్రలను నిర్వహించే విత్యాజ్ ఏరో ఎయిర్లైన్కు చెందినదని స్థానిక మీడియా నివేదించింది. వచ్కాజెట్స్ అగ్నిపర్వతం సందర్శన సమయంలో ఇది అదృశ్యమైనట్లు పేర్కొంది. కమ్చట్కా ప్రాంతంలోని వాచ్ కాజెట్స్ నుంచి బయల్దేరిన ఈ హెలికాప్టర్.. షెడ్యూల్ ప్రకారం గమ్యస్థానానికి చేరుకోలేదని తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు హెలికాప్టర్ కోసం గాలింపు చేపడుతున్నారు.