Rs. 2,500 for women.. BJP manifesto released

మహిళలకు రూ.2,500.. బీజేపీ మేనిఫెస్టో విడుదల

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మేనిఫెస్టోను విడుదల చేసారు. మహిళా సమృద్ధి యోజన పేరుతో ఢిల్లి మహిళలకు ప్రతినెలా 2500 రూపాయలు.. మొదటి క్యాబినెట్ లో ఆమోదం చేస్తాం. పేద మహిళలకు గ్యాస్ సిలిండర్ పై 500 రూపాయల సబ్సిడీ ఇస్తాం. హోలీ, దీపావళి పండుగల సమయంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తాం. గర్భిణీ స్త్రీల కోసం 21000 రూపాయలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఢిల్లీ బస్తీల్లో 5 రూపాయలకే భోజనం అందించేందుకు అటల్ క్యాంటీన్ల ఏర్పాటు చేస్తాం.

Advertisements
image
bjp

అలాగే దేశ రాజకీయాల్లో రాజకీయ నీతి సంస్కృతిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్చారు. గతంలో మేనిఫెస్టోలు ప్రకటించేవారు ఆ తర్వాత ప్రకటించిన వాళ్లు కూడా మర్చిపోయారు. బీజేపీ సంకల్ప పాత్రతో మేనిఫెస్టోలను ప్రకటించడమే కాకుండా వాటిని నిజం చేసి చూపిస్తుంది. బీజేపీ చెప్పింది చేస్తుంది. చెప్పనిది కూడా చేసి చూపిస్తుంది . మోడీ గ్యారంటీ.. అమలయ్యే గ్యారంటీ. 2014 లో 500 హామిలిస్తే, 499 అమలు చేశాం. 2019 లో 235 హామీలిస్తే, 225 అమలు చేశాం.. మిగతా హామీలు ప్రాసెస్‌లో ఉన్నాయి.

మరోవైపు మురికివాడల్లో అటల్ క్యాంటీన్ల ద్వారా రూ.5కే పౌష్టికార భోజనం అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఉచిత విద్యుత్‌, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం వంటి అమలులో ఉన్న పథకాలను కూడా కొనసాగిస్తామని భరోసా ఇచ్చింది.

Related Posts
కోర్టులో లొంగిపోయిన నందిగం సురేశ్
Nandigam Suresh surrendered in court

అమరావతి ఉద్యమం సమయంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే కేసు అమరావతి : వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ మళ్లీ జైలుకు వెళ్లనున్నారు. ఓ కేసు Read more

Summer : వేసవిలో ఈ జాగ్రత్తలతో చర్మం ఆరోగ్యవంతం!
summer season

వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, ఎండ తాకిడితో చర్మానికి నష్టం కలగడం సహజం. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం Read more

ఢిల్లీ ప్రజలు మార్పును కోరుకున్నారు: చంద్రబాబు
ఢిల్లీ ప్రజలు మార్పును కోరుకున్నారు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఆయన ఉండవల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ Read more

గోదావరి ఎక్స్ ప్రెస్ లో పొగలు..!
Smoke in Godavari Express

వైజాగ్ నుంచి సికింద్రాబాద్‌కు బయలుదేరిన గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం రాత్రి ఏసీ కోచ్‌లో జరిగిన ఘటన భయానక వాతావరణాన్ని సృష్టించింది. రాత్రి 1 గంట సమయంలో ఖమ్మం Read more

×