cm chandrababu pension 1

పింఛన్ల కోసం రూ.12,508 కోట్ల ఖర్చు – సీఎం చంద్రబాబు

అధికారం చేపట్టిన 110 రోజుల్లో పింఛన్ల కోసం కూటమి ప్రభుత్వం రూ.12,508 కోట్లు ఖర్చు చేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘1వ తేదీనే 98% మంది లబ్ధిదారులు ఇంటి వద్దనే పింఛను అందుకోవడం ఎంతో సంతృప్తినిచ్చింది. ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 64.38 లక్షల మందికి పింఛను అందించే కార్య క్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగులు సమర్థవంతంగా నిర్వహించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

ఈరోజు పబ్లిక్ హాలిడే కావడంతో పెన్షన్ల పంపిణీకి బ్రేక్ పడనుంది. తొలిరోజైన నిన్న రాత్రి 8 గంటల వరకు 97.65 శాతం పంపిణీ పూర్తయింది. 64.38 లక్షల మందికి గాను 62.90 లక్షల మందికి పెన్షన్లు అందజేశారు. 1వ తేదీ పబ్లిక్ హాలిడే/ ఆదివారం వస్తే ఆ ముందు రోజు, 2న హాలిడే/ ఆదివారం వస్తే ఆ తర్వాతి రోజు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం గురువారం పెన్షన్లు పంపిణీ చేయనున్నారు.

Related Posts
కాంగ్రెస్ హామీలపై హరీష్ రావు విమర్శలు
కాంగ్రెస్ హామీలపై హరీష్ రావు విమర్శలు

తెలంగాణ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పెద్ద హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు Read more

ఆధార్ పై ప్రైవేట్ సంస్థలకు అనుమతి
ఆధార్ పై ప్రైవేట్ సంస్థలకు అనుమతి

ఆధార్ కార్డు ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రం. ఇది ప్రతి భారత పౌరుని ప్రత్యేకంగా గుర్తించే 12 అంకెల ఒక ఐడీ నంబర్ అందిస్తుంది. Read more

దేవాలయాల స్వయంప్రతిపత్తి ప్రచారం: విశ్వ హిందూ పరిషత్
దేవాలయాల స్వయంప్రతిపత్తి ప్రచారం: విశ్వ హిందూ పరిషత్

హిందూ దేవాలయాలను రాజ్య నియంత్రణ నుండి విముక్తి చేసేందుకు విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించనుంది విశ్వ హిందూ పరిషత్ (VHP) హిందూ దేవాలయాల స్వయంప్రతిపత్తి Read more

రక్షణ ఎగుమతులు 21 వేల కోట్లు: రాజ్‌నాథ్ సింగ్
రక్షణ ఎగుమతులు 21 వేల కోట్లు: రాజ్‌నాథ్ సింగ్

భారత రక్షణ ఎగుమతులు దశాబ్దం క్రితం కేవలం రూ.2,000 కోట్ల నుంచి ఇప్పుడు రూ.21,000 కోట్లకు పైగా చేరుకున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. సోమవారం Read more