2024 టీ20 ప్రపంచ కప్ సమయంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ భారత్ జట్టులో ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు తన సత్తాను నిరూపించుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్న శాంసన్‌ను కాదని గాయం నుంచి కొత్తగా కోలుకున్న రిషబ్ పంత్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ ఆధారపడ్డారు అయితే ఫైనల్ మ్యాచ్‌లో తనను ఆడిస్తారని భావించినప్పటికీ చివర్లో నిర్ణయం మారిపోయిందని సంజూ వెల్లడించాడు భారత్ జట్టు ఫైనల్‌కు చేరిన తర్వాత రోహిత్ శర్మ తనను ఫైనల్ మ్యాచ్‌కు సిద్ధంగా ఉండమని చెప్పాడని తాను కూడా ఆ అవకాశాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని సంజూ తెలిపారు కానీ మ్యాచ్ ప్రారంభానికి కొద్దిసేపటి ముందు రోహిత్ తనకు వచ్చి సెమీఫైనల్‌లో ఆడిన జట్టునే ఫైనల్‌లో కూడా కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు వివరించాడని ఆ సమయంలో తన ఆడే అవకాశం కోల్పోయినట్లు తెలిపారు సంజూ శాంసన్ తన నిరాశను గోప్యంగా ఉంచి జట్టు నిర్ణయాన్ని గౌరవించాడని అన్నారు అంతేకాకుండా రోహిత్ శర్మ తనతో ఎంతో సమయం గడిపి అతనికి వివరాలు చెప్పాడని సంజూ గుర్తు చేసుకున్నాడు రోహిత్ చెప్పిన మాటలను సవివరంగా వివరిస్తూ సంజూ వార్మప్ సమయంలో రోహిత్ నన్ను పక్కకు తీసుకెళ్లి ఎందుకు నన్ను ఆడించడం లేదో చెప్పడం మొదలు పెట్టాడు నీవు ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకున్నావా అని నన్ను ప్రశ్నించాడు చాలా సాధారణంగా చెప్పినా రోహిత్‌తో ‘మ్యాచ్ గెలిచిన తర్వాత మాట్లాడతాం ముందుగా మీరు మ్యాచ్‌పై దృష్టి పెట్టండి అని చెప్పాను అని వివరించాడు తదుపరి ఇంటర్వ్యూలో జట్టులో అవకాశం లేకపోయినా తనను ముందుకు సాగేలా చేసే జట్టుతో శాంసన్ కలసి ఉండటమే తనకు సంతోషకరమని అన్నారు ఆటలో అవకాశం దక్కకపోయినా జట్టు విజయం సాధించినందుకు తాను సంతోషంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.
