Road accident in Vontimitta.. Three dead

Road Accident : ఒంటిమిట్టలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Road Accident : వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మూడు వాహనాలు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి వైపు నుంచి మితిమీరిన వేగంతో వచ్చిన స్కార్పియో వాహనం.. ఆర్టీసీ బస్సు, పోలీసు రక్షక వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.

Advertisements
ఒంటిమిట్టలో రోడ్డు ప్రమాదం ముగ్గురు

అతివేగమే ప్రమాదానికి కారణం

ఈ ఘటనలో స్కార్పియోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారని అధికారులు తెలిపారు. మృతులు నంద్యాల జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన వారిగా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో పోలీసు వాహనంలో ఉన్న కానిస్టేబుల్‌ రఘునాథరెడ్డితోపాటు డ్రైవర్‌కు తీవ్ర గాయాలైనట్లు చెప్పారు. వారిని కడప రిమ్స్‌కు తరలించి, చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనం నుజ్జునుజ్జయిందని.. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.

Read Also:  44 వేల ఎకరాలు కావాలట… చంద్రబాబుపై షర్మిల విమర్శలు

Related Posts
YS Vivekananda: మా నాన్న కేసులో సాక్షులు చనిపోవడం అనుమానాస్పదమే : సునీత
deaths of witnesses in my father case are suspicious: Sunitha

YS Vivekananda : వైఎస్‌ వివేకా కేసులో ఉన్న సాక్షులు చనిపోవడంపై వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. మా నాన్న కేసులో Read more

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
Parliament sessions from today

న్యూఢిల్లీ: ఈరోజు ( సోమవారం )నుండి పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. ఇవి ఏప్రిల్‌ 4వ తేదీ దాకా కొనసాగుతాయి. పలు శాఖలకు Read more

విడాకుల వార్తలకు బరాక్ ఒబామా చెక్
Happy birthday my love..Obama check for divorce news

న్యూయార్క్‌ : అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా తన భార్య మిషెల్ ఒబామాతో విడాకులు తీసుకుంటున్నారని వస్తోన్న వార్తలకు చెక్ పెట్టారు. ఆమె బర్త్ డే Read more

ఏపీ లో మున్సిపల్ అధికారుల కీలక ఆదేశాలు
ఏపీ లో మున్సిపల్ అధికారుల కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనిమున్సిపాలిటీల్లో పన్నుల బకాయిల వసూలుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని రెండో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×