అమెరికా: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భారతీయులు మృతి చెందారు. అమెరికాలోని రాండాల్ఫ్ సమీపంలో సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చనిపోయిన ఐదుగురిలో ముగ్గురు ఏపీకి చెందిన వారు ఉన్నారు. వీరిలో ఒక్కరు మహిళ కూడా ఉంది. ఈ ముగ్గురు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన వారు.వీరిలో ఇద్దరు శ్రీకాళహస్తికి చెందిన వారు ఉండగా.. మరొకరు గూడురుకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. మృతులు డేగపూడి హరితా రెడ్డి, చిరంజీవి శివ, గోపి తిరుమూరు గా గుర్తించారు.
టెక్సాస్ రహదారి నంచి దక్షిణ బాన్‌హామ్‌కు 8 కిలోమీటర్ల దూరంలో సోమవారం సాయంత్రం 6.45 గంటలకు రెండు వాహనాలు ఒకదానికి ఒక్కటి బలంగా ఢీకొన్నట్లు తెలిసింది. అక్కడున్న తెలుగు వారు ఈ వార్తను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో గాయపడిన చెన్ను సాయి తేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కాణాలు తెలియరాలేదు. రాంగ్‌రూట్‌లో వెళ్లడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
గతంలో కూడా అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగి తెలుగు వారు మృతి చెందారు. సెప్టెంబర్ లో అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయలు చనిపోయారు. టెక్సాస్‌లోని అన్నాలో యుఎస్ రూట్ 75లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. మృతి చెందిన నలుగురిలో ముగ్గురు హైదరాబాద్ కు చెందిన వారు ఉన్నారు. మరొకరు చెన్నైకి చెంది వారు. ఒకేసారి ఐదు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో హైదరాబాద్ కు చెందిన ఆర్యన్ రఘునాథ్ ఓరంపాటి(27),ఫరూక్ షేక్ (30), లోకేష్ పాలచర్ల (28) ఉన్నారు. మరో వ్యక్తి తమిళనాడుకు చెందిన దర్శిని వాసిదేవన్ (25)గా గుర్తించారు.