తెలంగాణ ప్రభుత్వం దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో తన తొలి పెద్ద ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రఖ్యాత వినియోగ వస్తువుల తయారీ సంస్థ యూనిలీవర్‌తో రాష్ట్రానికి పెట్టుబడులపై జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి. ముఖ్యంగా తెలంగాణలో తయారీ యూనిట్ల ఏర్పాటుకు కంపెనీ అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది.తెలంగాణ ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి రేవంత్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో యూనిలీవర్ సీఈఓ హీన్ షూమేకర్, చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉయిజెన్‌లతో సమావేశమైంది.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న విస్తారమైన అవకాశాలను వారికీ వివరించారు.యూనిలీవర్ కంపెనీ, తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలంగా ఉందని, దీనికి సంబంధించిన ఒప్పందాలు విజయవంతమయ్యాయని రాష్ట్ర ప్రతినిధుల బృందం వెల్లడించింది. మారెడ్డిలో పామాయిల్ తయారీ యూనిట్ ప్రారంభానికి యూనిలీవర్ సిద్ధమవ్వడమే కాకుండా, రాష్ట్రంలో బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేయడానికి ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ ఒప్పందాలతో తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధి వేగవంతమవుతుందని ఆశిస్తున్నారు.దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో చర్చలు జరిపింది. ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ ఎజిలిటీ ఛైర్మన్ తారెక్ సుల్తాన్‌తో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమై, రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల ఆదాయ వృద్ధి కోసం అనుసరించవచ్చిన విధానాలపై చర్చించారు.
అలాగే, కాలిఫోర్నియాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ సాంబనోవా చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సూలేతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. ఈ చర్చల్లో సెమీ కండక్టర్ పరిశ్రమల్లో పెట్టుబడుల అవకాశాలను ప్రస్తావించారు.దావోస్‌లో జరిగిన ఈ తొలి ఒప్పందం తెలంగాణ అభివృద్ధికి మరింత గమ్యాన్ని చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. యూనిలీవర్ వంటి గ్లోబల్ బ్రాండ్‌లు పెట్టుబడుల కోసం ముందుకొస్తుండటం రాష్ట్ర పరిశ్రమల రంగానికి గొప్ప పురోగతిగా పేర్కొంటున్నారు.ఇవన్నీ చూస్తుంటే, తెలంగాణ పెట్టుబడులకు అనుకూలమైన ప్రదేశంగా తన స్థానాన్ని మరింత బలపరుస్తోంది.