సత్యాగ్రహ దీక్షని నీరుగార్చడానికి బీఆర్ఎస్ ఉచిత విద్యుత్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది – రేవంత్

రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా బుధవారం కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష చేపట్టబోతుంది. ఇదే క్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఉచిత విద్యుత్ అంశం ఫై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు , రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళలనకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళన అంశం ఫై రేవంత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా తాము బుధవారం సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నామని, దీనిని నీరుగార్చేందుకు బీఆర్ఎస్ ఉచిత విద్యుత్ అంశంతో రాద్ధాంతం చేస్తూ కుట్రకు తెరలేపిందని రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్ అని దీనిని బట్టి మరోసారి తేలిపోయిందన్నారు. సత్యాగ్రహ దీక్షని నీరుగార్చడానికి బీఆర్ఎస్ ఉచిత విద్యుత్ అంశాన్ని తెరపైకి తెచ్చి, దృష్టి మరలించే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

బీఆర్ఎస్ 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తోందన్నారు. 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదన్న విషయాన్ని ఏ సబ్ స్టేషన్ కు వెళ్లినా తెలుస్తుందని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను రూ.60 వేల కోట్ల అప్పుల్లో ముంచి, తన అవినీతికి బలిపెట్టిన ఘనుడు కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మోసాలకు నిరసనగా రాష్టవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోని సబ్ స్టేషన్ల వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

మరి రేపు కాంగ్రెస్ , బిఆర్ఎస్ శ్రేణుల నిరసన లు ఎలా ఉంటాయో అనేది టెన్షన్ పెడుతుంది.