రియల్ ఎస్టేట్ సంక్షోభానికి కారణం రేవంత్ రెడ్డి: హరీష్ రావు

రియల్ ఎస్టేట్ సంక్షోభానికి కారణం రేవంత్ రెడ్డి: హరీష్ రావు

తెలంగాణలో రియల్ ఎస్టేట్ సంక్షోభానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.

Advertisements

హైదరాబాద్ నగర అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ప్రభుత్వ పాలన రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద అడ్డంకిగా మారిందని హరీష్ రావు విమర్శించారు. గత ఏడాదిన్నర కాలంగా రియల్ ఎస్టేట్ రంగం క్షీణిస్తోందని వివిధ సర్వే సంస్థలు హెచ్చరించినా, అధికార పార్టీ పట్టించుకోలేదని ఆయన అన్నారు. కొంపల్లి రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి, ఆదిభట్ల నరసింహ గౌడ్ మరణాల ఘటనలను ప్రస్తావించిన హరీష్ రావు, సంక్షోభం వేగంగా వ్యాపిస్తున్నదని, వ్యాపారులు తీవ్ర నిరాశలో ఉన్నారని తెలిపారు.

హైడ్రా కూల్చివేతలు, మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ నిలిపివేత, ఫార్మా సిటీ రద్దు, మెట్రో మార్గ మార్పులు వంటి ప్రభుత్వ నిర్ణయాలు రియల్ ఎస్టేట్‌పై తీవ్ర ప్రభావం చూపాయని ఆయన విమర్శించారు. ఇలాంటి విధానపరమైన తప్పిదాలతో పెట్టుబడిదారులు వెనుకంజ వేస్తున్నారని, రంగం మరింత సంక్షోభంలోకి వెళ్లే ముప్పు ఉందని హెచ్చరించారు. నరసింహ గౌడ్ కుటుంబానికి వెంటనే ఆర్థిక సహాయం అందించాలని, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సమస్య మరింత పెరగకుండా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సూచించారు.

Related Posts
ఐపీఎల్ 2025లో ధోని ఆడనున్నాడా
ఐపీఎల్ 2025లో ధోని ఆడనున్నాడా

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తన అభిమానులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమయ్యాడు.43 ఏళ్ల వయసులో కూడా ధోనీ ఐపీఎల్ 2025 సీజన్ కోసం బ్యాటింగ్ Read more

రేవంత్ రెడ్డివి దిగజారుడు మాటలు- కిషన్ రెడ్డి
kishan reddy , revanth redd

రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ వ్యాఖ్యలు డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ రాజకీయాల్లో మరోసారి గొడవ తలెత్తింది. CM రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీ పుట్టుకతో BC Read more

దేవర 11 డేస్ కలెక్షన్స్
devara 11 day

ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మూవీ దేవర.. రిలీజ్ కు ముందు భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ మిక్సీ్డ్ టాక్ ను Read more

అంజీర్ పండ్లను రాత్రి నానబెట్టి తింటే కలిగే లాభాలు
health benefits of anjeer f

ఆరోగ్య నిపుణులు ప్రకారం, అంజీర్ పండ్లను రాత్రి నానబెట్టి ఉదయం తినడం శరీరానికి అనేక రకాల లాభాలను అందిస్తుంది. ఈ పండ్లను తేనెతో కలిపి పరగడుపున తింటే Read more

Advertisements
×