ktr

రేవంత్ రెడ్డి నిజాయితీగల మోసగాడు – కేటీఆర్

  • హామీలను నెరవేర్చకుండా, మోసం చేస్తున్న వ్యక్తి
  • రేవంత్ పాలన పూర్తిగా విఫలం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, మోసం చేస్తున్న వ్యక్తి అని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. “కేసీఆర్ హయాంలో రైతులకు రూ.10,000 రైతుబంధు ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు రూ.15,000 అందిస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు రూ.12,000 మాత్రమే అంటున్నారు. అసలు ఆ మొత్తాన్ని కూడా ఇప్పటివరకు అందించలేకపోయారు” అని కేటీఆర్ విమర్శించారు.

ఉగాది పండుగ కానుకగా సన్నబియ్యం పంపిణీ

అంతేకాదు, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రుణమాఫీ, బోనస్, మహిళలకు రూ.2500 ఆర్థిక సహాయం వంటి హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రిని తిట్టనంతగా రేవంత్ రెడ్డిని తిడుతున్నారని, ఆయన పాలన పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు కేవలం ఓట్ల కోసమే అన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డి నిజాయితీగల మోసగాడని, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏమాత్రం మేలు జరగలేదని కేటీఆర్ ఆరోపించారు. “తులం బంగారం ఇవ్వడం కాదు, మహిళల మెడలో ఉన్న పుస్తెలతాడు కూడా తీసుకెళ్తాడనే పరిస్థితి వచ్చింది” అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారని, త్వరలోనే తెలంగాణలో మార్పు అనివార్యమని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉధృతతను తెచ్చాయి.

Related Posts
Hyderabad: హిట్ అండ్ రన్ ప్రమాదంలో యువతికి గాయాలు
Hyderabad: హిట్ అండ్ రన్ ఘటన – యువతికి తీవ్ర గాయాలు!

హైదరాబాద్ నగరంలో మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన నిందితుడు కారు వేగంగా నడిపి ఒక యువతిని ఢీ కొట్టిన ఘటన తీవ్ర సంచలనాన్ని రేపింది. మేడ్చల్ జిల్లా Read more

పద్మ అవార్డులు 2025: పూర్తి జాబితా
పద్మ అవార్డులు 2025: పూర్తి జాబితా

ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డుల గ్రహీతలను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. పద్మ అవార్డులు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి, ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా Read more

మహిళా ఎస్సైపై యువకుల దాడి..చివరికి ఏమైంది?
గుడివాడలో మహిళా ఎస్సైపై దాడి.. పోలీసులు ఏం చేశారు?

విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామంలో మంగళవారం రాత్రి వేణుగోపాలస్వామి జాతర సందర్భంగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సంప్రదాయంగా ప్రతి ఏటా నిర్వహించే ఈ జాతరలో డాన్స్‌ Read more

జీహెచ్ఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం
జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం

హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మరియు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిలపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 91-ఏ Read more