CM Revanth Reddy meet with Rahul Gandhi..!

రాహుల్ గాంధీ తో రేవంత్ భేటీ

తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి . ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ పార్టీ అధినాయకత్వంతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో పాటుగా మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైనా రేవంత్ పార్టీ ముఖ్య నేత రాహుల్ తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆరుగురుకి అవకావం పైనా ప్రతిపాదలు కోరారు. ఇక, టీపీసీసీకి కొత్త ఇన్ ఛార్జ్ రావటంతో పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యల పైన నిర్ణయాలు తీసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటన ఆసక్తి కరంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్ ఛార్జ్ ను నియ మిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. తక్కవ కాలంలోనే తెలంగాణ పార్టీ ఇన్ ఛార్జ్ ల మార్పు రాజకీయంగా చర్చకు కారణమవుతోంది. ఇప్పుడు నూతన బాధ్యతలను మీనాక్షి నటరాజన్ కు అప్పగించారు. రాహుల్ టీమ్ లో కీలకంగా ఉన్న మీనాక్షికి తెలంగాణ బాధ్యతలు అప్పగించటం ద్వారా రాష్ట్రంలో వ్యవహారాల పైన పార్టీ హైకమాండ్ మూడ్ ఏంటనేది స్పష్టం అవుతోంది. ఇదే సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపు మేరకు సీఎం రేవంత్ పార్టీ అగ్ర నాయకత్వంతో సమావేశం అవుతున్నారు. ఈ భేటీలో కీలక అంశాల పైన చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతుండగా ఇప్పుడు ఆమోదం దిశగా చర్చ జరుగుతోందని సమాచారం.కులగణన పూర్తి చేయటంతో సూర్యాపేటలోనూ గద్వాల్ లోనూ ఏప్రిల్ నూ సభలు ఏర్పాటు చేయాలని రేవంత్ భావిస్తున్నారు. ఈ సభలకు రేవంత్ ను ఆహ్వానించనున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పూర్తి చేసిన కులగణన, ఎస్సీ వర్గీకరణపై తీసుకున్న నిర్ణయాలను పార్టీ నాయకత్వానికి వివరించనున్నారు. మంత్రివర్గ విస్తరణకు ఈ సారి ఆమోదం లభిస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మంత్రివర్గంలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశం పైన సామాజిక సమీకరణాల ఆధారంగా తుది జాబితా ఖరారు చేయను న్నారు. అదే విధంగా నామినేటెడ్ పదవుల భర్తీ పైన చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కు ముందే నామినేటెడ్ పదవులు భర్తీ చేయటం ద్వారా పార్టీలో జోష్ వస్తుందని భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ పదవుల ఖరారు పైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

rahulgandhirevanthreddy1 1739602850

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై ఆసక్తికర చర్చలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఏఐసీసీ (అఖిల భారత కాంగ్రెస్ కమిటీ) రాష్ట్ర వ్యవహారాల్లో కీలక మార్పులు చేయడం గమనార్హం. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ పదవిలో మార్పు చేస్తూ, కొత్తగా మీనాక్షి నటరాజన్‌ను నియమించారు. రాహుల్ గాంధీ నమ్మకస్థురాలిగా పేరున్న మీనాక్షి, రాష్ట్ర బాధ్యతలు స్వీకరించడంతో పార్టీ హైకమాండ్ వ్యూహం ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై ఆసక్తికర చర్చలు

ఇదే సమయంలో ఢిల్లీ పిలుపు మేరకు సీఎం రేవంత్ పార్టీ అగ్రనాయకత్వంతో సమావేశమవుతున్నారు. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా చర్చించనున్నారు. ముఖ్యంగా, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలు ప్రధాన ఎజెండాగా ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై నివేదిక:
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పూర్తి చేసిన కులగణన ప్రక్రియ, ఎస్సీ వర్గీకరణ అంశాలపై సీఎం రేవంత్ హైకమాండ్‌కు వివరించనున్నారు. రాష్ట్రంలో కులగణన ఫలితాల ఆధారంగా ఏర్పడుతున్న సామాజిక, రాజకీయ పరిస్థితులపై హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.

ఏప్రిల్‌లో సభలతో భారీ ప్రణాళిక:
ఈ క్రమంలో, ఏప్రిల్‌లో సూర్యాపేట, గద్వాల్‌లలో పెద్దఎత్తున సభలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వ సాధనలను వివరించేందుకు ఈ సభలు వేదిక కానున్నాయి. రేవంత్ స్వయంగా ఈ సభల్లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Related Posts
వారికి రైతు భరోసా ఇవ్వం తేల్చేసిన మంత్రి పొంగులేటి
Ponguleti Srinivasa Reddy

రైతు భరోసా పథకం అమలులో ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని పాటిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రైతులకు ఉపశమనం కలిగించే ఈ పథకం, భూమి యోగ్యత Read more

రేపే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..
Polling for MLC election tomorrow

రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్‌ స్థానాలకు ఎన్నికలు హైదరాబాద్‌: ఉమ్మడి కరీంనగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌(ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌) రెండు ఎమ్మెల్సీ స్థానాలకు, నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం(ఉపాధ్యాయ) ఎమ్మెల్సీ Read more

1,690 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధం..
Filling up of medical posts

తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉంది. ఇప్పటికే పలు హామీలను నెరవేర్చగ..ఇటు నిరుద్యోగులకు సైతం వరుస గుడ్ న్యూస్ Read more

యాదాద్రి ఫోటో షూట్ పై ఎమ్మెల్యే పాడి క్లారిటీ
paadi photoshoot

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, తన సతీమణి శాలినితో కలిసి యాదాద్రి ఆలయంలో నిర్వహించిన ఫొటో షూట్ రాష్ట్రంలో వివాదం రేపిన విషయం తెలిసిందే. ఈ Read more