1.21 లక్షలకు పైగా జాబ్ కార్డులు తొలగింపు!

2023-24 మధ్య కాలంలో తెలంగాణలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి 1,21,422 మంది కార్మికుల పేర్లను తొలగించినట్లు కేంద్రం వెల్లడించింది. లోక్ సభలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) ఎంపీ ఎస్.వెంకటేశన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ సమాధానమిచ్చారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 68 లక్షలకు పైగా(68,86,532) మంది కార్మికులను, తొలగించారని, 2022-23లో 86,17,887 మంది కార్మికులను తొలగించారని వెల్లడించారు. ఉపాధి హామీ పథకంలో రాష్ట్రాల వారీగా డేటాను కూడా మంత్రి తెలిపారు. తెలంగాణ నుంచి 1.21 లక్షలకు పైగా జాబ్ కార్డులను తొలగించినట్లు తెలిపారు.

External affairs minister S Jaishankar AFP Photo 1670855879733

నకిలీ,తప్పు జాబ్ కార్డులు, పలు కుటుంబాలు గ్రామాలను శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్లడం, గ్రామాలను పట్టణ ప్రాంతాలుగా మార్చడం వంటి కారణాల వల్ల ఉపాధి హామీ పథకంలో తొలగింపులు జరిగాయని మంత్రి చెప్పారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మెటీరియల్ కాంపోనెంట్స్ కోసం పెండింగ్ నిధులు రూ.282.74 కోట్లు, కార్మికులకు ఇవ్వాల్సిన నిధులు రూ.15.46 కోట్లు చెల్లించాల్సి ఉంది.

దేశంలోని గ్రామీణ నిరుద్యోగులకు ఉపాధిని కల్పించడమే లక్ష్యంగా మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. ఇటీవల కాలంలో ఉపాధి హామీ పథకం కోసం వాస్తవ విడుదల మొత్తాలు ప్రారంభ బడ్జెట్ అంచనాలను మించిపోయాయి. దీనిని బట్టి ఉపాధి పొందేవారి సంఖ్య అర్థం అవుతుంది.ఈ పథకం అమలు బాధ్యత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఉందని మంత్రి కమలేష్ పాశ్వాన్ వెల్లడించారు. జాబ్ కార్డులను అప్ డేట్ చేయడం తొలగించడం అనేది రాష్ట్రాలు నిర్వహించే ఒక సాధారణ ప్రక్రియ అని తెలిపారు. అయితే జాబ్ కార్డులను తొలగించే సమయంలో నిబంధనలకు అనుగుణంగా ఉండాలని ఆయన సూచించారు. అర్హత కలిగిన కుటుంబాల జాబ్ కార్డులను రద్దు చేయలేమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ స్పష్టం చేశారు.

Related Posts
హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
Heavy cases of drunk and driving in Hyderabad

హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరించినా మందుబాబుల తీరు మారలేదు. మంగళవారం నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో భారీగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ Read more

TGMC దాడి: కాజీపేట, హన్మకొండలో నకిలీ వైద్యులపై కఠిన చర్యలు
medicine scaled

తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) వారు, నవంబర్ 17, ఆదివారం, కాజీపేట మరియు హన్మకొండ జిల్లాల్లోని నకిలీ వైద్యులు క్లినిక్‌లపై రైడ్ నిర్వహించారు. ఈ రైడ్లలో మూడు Read more

హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్
Telangana CM Revanth returns to Hyderabad from Davos

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ శ్రేణులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఆయనకు ఘనంగా స్వాగతం Read more

దావోస్‌లో తెలంగాణ కీలక ఒప్పందం
revanth reddy

దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ Read more