బెజవాడలో ‘జనసేన’ బ్యానర్ల తొలగింపు : పరిస్థితి ఉద్రిక్తం

పోలీసులకు వ్యతిరేకంగా నేతలు, కార్యకర్తల నినాదాలు

Janasena party leader Nadendla Manohar questioning the police
Janasena party leader Nadendla Manohar questioning the police

Vijayawada: జనసేన పార్టీ ఆవిర్భావ స దినోత్సవ సభ సోమవారం మంగళగిరి పరిధిలోని ఇప్పటంలో జరగనుంది.. ఈ మేరకు జనసేన పార్టీ విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్‌పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని అధికారులు తొలగించడంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరడంతో పరిస్థితి ఒకింత ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా పోలీసులకు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోలీసులే కాపలా కాస్తూ బ్యానర్లు తొలగిస్తున్నారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌ సంఘటన స్థలానికి వెళ్లి ఈ విషయంపై మున్సిపల్‌ సిబ్బందిని నిలదీశారు. అయితే అక్కడే ఉన్న పోలీసులు ఆయనకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులే ఇదంతా దగ్గరుండి చేయిస్తున్నారని మనోహర్‌ వాగ్వాదానికి దిగారు. పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/