Religious Event Maha Kumbh Mela .. Mamata Banerjee

మతపరమైన కార్యక్రమం మహాకుంభమేళా : మమతా బెనర్జీ

యూపీ సర్కారు వీఐపీలకు మాత్రమే ఏర్పాట్లు చేసిందని ఆగ్రహం

కోల్‌కతా : ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కార్‌పై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మతపరమైన కార్యక్రమం మహాకుంభమేళాకు సరైన ప్రణాళిక లేదని విమర్శించారు. ఇటీవలే అక్కడ జరిగిన తొక్కిసలాట ఘటననను ప్రస్తావిస్తూ.. మహాకుంభ్‌ను ‘మృత్యు కుంభ్‌’గా అభివర్ణించారు.

Advertisements
మతపరమైన కార్యక్రమం మహా కుంభమేళా

ఇంత సీరియస్‌ ఈవెంట్‌ను ఎందుకు ఓవర్‌ హైప్‌

కుంభమేళాకు వచ్చే వీఐపీలకు మాత్రం ప్రత్యేక హక్కులు కల్పిస్తున్నారని మండిపడ్డారు. పేదలను మాత్రం విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం ‘దేశాన్ని విభజించేందుకు మతాన్ని అమ్ముతోంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత సీరియస్‌ ఈవెంట్‌ను ఎందుకు ఓవర్‌ హైప్‌ చేశారంటూ..? యూపీ సర్కార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.

కుంభమేళా అంటే తనకు గౌరవం ఉందన్నమమతా బెనర్జీ

బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో దీదీ మాట్లాడుతూ.. ‘అది ‘మృత్యు కుంభ్‌’. నేను మహాకుంభ్‌ను గౌరవిస్తాను. పవిత్ర గంగామాతనూ గౌరవిస్తా. కానీ అక్కడ సరైన ప్రణాళిక లేదు. ధనవంతులు, వీఐపీలకు ప్రత్యేక క్యాంపులు ఉన్నాయి. రూ.లక్షలు వెచ్చించి ప్రత్యేక టెంట్లు బుక్‌ చేసుకునే వ్యవస్థ ఉంది. కానీ పేదలకు మాత్రం ఎలాంటి ఏర్పాట్లూ లేవు. ఇలాంటి కార్యక్రమాల్లో (మేళా) తొక్కిసలాట ఘటనలు సాధారణమే. కానీ అలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేయడం ముఖ్యం. ఇక్కడ మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు..?’ అంటూ యూపీ సర్కార్‌ను దీదీ ప్రశ్నించారు.

Related Posts
‘ఇంకొసారి ఇలా మాట్లాడొద్దు’.. కొండా సురేఖపై కోర్టు సీరియస్‌
Konda Surekha defamation case should be a lesson. KTR key comments

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇకపై కేటీఆర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని Read more

పి ఎస్ ఎల్ వి రాకెట్ ప్రయోగం విజయవంతం
PSLV rocket launch successf

శ్రీహరికోట : శ్రీహరికోట నుండి ఇస్రో ప్రయోగించిన పి ఎస్ ఎల్ వి - సి 59 ప్రయోగం విజయవంతం అయ్యింది. అంతరిక్ష కక్షలోకి చేరిన ప్రోబా Read more

IPL 2025:రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం
IPL 2025:రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం

ఐపీఎల్ 2025 సీజన్‌లో బుధవారం (ఏప్రిల్‌ 16) జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది.తొలి సూపర్‌ ఓవర్‌ పోరులో రాజస్థాన్‌పై ఢిల్లీ Read more

Vijay Sai Reddy: జగన్ ను విమర్శించిన విజయసాయిరెడ్డిని తిప్పి కొట్టిన సుబ్బారెడ్డి
Vijay Sai Reddy: జగన్ ను విమర్శించిన విజయసాయిరెడ్డిని తిప్పి కొట్టిన సుబ్బారెడ్డి

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తీవ్ర స్పందన ఏపీ లిక్కర్ స్కామ్ విచారణకు సంబంధించి ఇటీవల రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి విచారణకు హాజరైన Read more

×