మౌని అమావాస్య రోజున పుణ్యస్నానానికి పెద్ద సంఖ్యలో యాత్రికులు తరలిరావడంతోనే తొక్కిసలాటకు ప్రధాన కారణమని పోలీసులు చెబుతున్నారు. మౌని అమావాస్య నాడు అమృత స్నాన్ మహా కుంభం యొక్క అత్యంత ముఖ్యమైన ఆచారం. సుమారు 10 కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా వేశారు. అందుకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. కానీ ఒక్కసారిగా రద్దీ పెరిగి, అకస్మాత్తుగా తోపులాట జరగడంతో ఈ అనేకులు మరణించడంతో పాటు గాయపడ్డారు. త్రివేణి సంగమ ముక్కు భాగానికి చేరుకోవాలన్న ఉద్దేశంతో జనం పోటెత్తుతున్నారని, దీంతో తీవ్ర వత్తిడి ఉంటోందన్నారు. మౌనా అమావాస్య సందర్భంగా జనం భారీగా వచ్చారని, అయితే అకాడాలు వెళ్లే మార్గం వద్ద ఉన్న బారికేడ్లను నెట్టివేశారని, దీంతో అక్కడ తొక్కిసలాట జరిగినట్లు చెప్పారు. గాయపడ్డ వారిని వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామన్నారు.

మంగళవారం రాత్రే మౌనీ అమావాస్య ప్రారంభం కావడంతో.. లక్షల సంఖ్యలో జనం పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారన్నారు. ఈ సంవత్సరం, ‘త్రివేణి యోగం’ అనే అరుదైన ఖగోళ రోజని, 144 సంవత్సరాల తర్వాత ఇది సంభవిస్తుందని, ఈ రోజు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పెంచుతుందని హిందుమేధావులు చెబుతారు. కాగా ఈ సంఘటనలో గాయపడిన వారిని మేళా ప్రాంతంలో ఏర్పాటు చేసిన కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పలువురు పాలనా అధికారులు, పోలీసు అధికారులతో పాటు పలువురు గాయపడిన వారి బంధువులు కూడా అక్కడికి చేరుకున్నారు.
యాత్రికులు సంగం ఘాట్‌కు చేరుకోవడానికి నియమించబడిన మార్గాలను ఉపయోగించాలని, స్నాన ప్రదేశానికి చేరుకునేటప్పుడు వారి దారులలో ఉండాలని, పవిత్ర స్నానం తర్వాత ఘాట్‌ల వద్ద ఎక్కువసేపు ఉండకుండా ఉండాలని అధికారులు కోరారు. సజావుగా వెళ్లేందుకు పార్కింగ్ ప్రాంతాలకు లేదా వారి గమ్యస్థానాలకు వెంటనే వెళ్లాలని వారిని కోరారు.