“రీ బిగ్ గ్రీన్ గణేశ” వేడుకలు ప్రారంభించిన రీ-సస్టైనబిలిటీ

Re-Sustainability Launched by “Re Big Green Ganesha” Celebrations

హైదరాబాద్‌: అవార్డు గెలుచుకున్న గ్రీన్ గణేశ కార్యక్రమం యొక్క 17వ ఎడిషన్ #రీ బిగ్ గ్రీన్ గణేశ కోసం 92.7 బిగ్ ఎఫ్ఎం తో తమ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నామని రీ సస్టైనబిలిటీ లిమిటెడ్ (ఆర్ఈఎస్ఎల్) వెల్లడించింది. వృత్తాకార ఆర్థిక వ్యవస్థలో అంతర్జాతీయంగా అగ్రగామిగా, రీ సస్టైనబిలిటీ ఈ కార్యక్రమాన్ని మిషన్ లైఫ్‌ (LiFE) ప్రోగ్రాం కు అనుగుణంగా తీర్చిదిద్దింది. తద్వారా, ప్రపంచ వాతావరణ ప్రయత్నాలలో వ్యక్తిగత చర్యలు మరియు స్థానిక సంస్కృతుల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఈ కార్యక్రమం, కమ్యూనిటీలను నిమగ్నం చేస్తుంది, వినూత్న కార్యకలాపాల శ్రేణి ద్వారా పర్యావరణ అనుకూల అభ్యాసాలను ప్రోత్సహిస్తుంది. ఈ సంవత్సరం కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 15,000 కు పైగా పర్యావరణ అనుకూలమైన విత్తన గణేశ విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది, ఈ విగ్రహాలలో విత్తనాలు మరియు ఎరువును పొందుపరిచారు. ఈ విగ్రహాలు , నిమజ్జన ఆచారాన్ని ఇంట్లో నిర్వహించడానికి భక్తులను అనుమతిస్తాయి. విగ్రహాన్ని పూల కుండిలో నిమజ్జనం చేయటం వల్ల విగ్రహం లోని విత్తనాలు మొక్కలుగా ఎదుగుతాయి. అవి కొత్త జీవితం యొక్క పుట్టుకకు ప్రతీకగా నిలుస్తాయి. రీ సస్టైనబిలిటీ యొక్క కార్పొరేట్ కార్యాలయంలో జరిగిన వేడుకలో ముఖ్య అతిథిగా నటుడు, మరియు ఈ వార్షిక కార్యక్రమానికి దీర్ఘకాల మద్దతుదారు శ్రీ సుధీర్ బాబు హాజరయ్యారు. తమ కార్యకలాపాల ప్రభావాన్ని మరింత విస్తరించే ప్రయత్నంలో భాగంగా రీ సస్టైనబిలిటీ మరియు 92.7 బిగ్ ఎఫ్ఎం హైదరాబాద్‌లో యూజ్డ్ పేపర్ కలెక్షన్ డ్రైవ్‌ను ప్రారంభించాయి. సేకరించిన కాగితం , పెద్ద పర్యావరణ అనుకూల గణేశ శిల్పాలుగా రీసైకిల్ చేయబడుతుంది. సేకరణ కార్యక్రమం తరువాత, గణేశ విగ్రహం యొక్క స్థాపన మరియు హారతి (పూజ ), స్వీట్ల పంపిణీ తో సహా 7-రోజుల పాటు మాల్ ఈవెంట్ గా వేడుకలను నిర్వహిస్తారు. ముంబైలోని బీచ్ పరిశుభ్రత కార్యక్రమాలతో ఈ వేడుకలు ముగుస్తాయి.

రీ బిగ్ గ్రీన్ గణేశ ప్రచారంలో భాగంగా బిగ్ ఎఫ్ఎం ఆర్ జె ల నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఆకర్షణీయమైన కార్యకలాపాలు కూడా నిర్వహించనున్నారు, ప్లాస్టిక్ బాటిల్ వినియోగాన్ని తగ్గించడం వంటి పర్యావరణ అనుకూలమైన అలవాట్లను పాటించేలా వీరు శ్రోతలను ప్రోత్సహిస్తారు . శ్రోతలు ప్లాస్టిక్ బాటిళ్లను విరాళంగా అందించేందుకు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్‌డబ్ల్యూఏ) వద్ద ప్రత్యేక కలెక్షన్ పాయింట్లు ఏర్పాటు చేస్తారు. ఈ సీసాలు సృజనాత్మకంగా పూజా మండప అలంకరణలలో చేర్చబడతాయి, వాటిని అద్భుతమైన కళాఖండాలుగా మారుస్తాయి మరియు “ప్లాస్టిక్ కే విఘ్నహర్తా” (ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా సంరక్షకులు) ఆలోచనను ప్రచారం చేస్తాయి. ఈ సేకరించిన సీసాలు తరువాత రీసైకిల్ చేయబడతాయి లేదా అదే కమ్యూనిటీ లో ఒక బెంచ్‌గా పునర్నిర్మించబడతాయి, తద్వారా ఆచరణాత్మక మరియు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను ప్రదర్శిస్తాయి. గణేశోత్సవం జరిగినన్ని రోజులూ వాలంటీర్లు గణపతి మండపాల వద్ద పరిశుభ్రత మరియు పర్యావరణ అనుకూల పద్ధతులను నిర్వహించటం ద్వారా మద్దతు ఇస్తారు. బిగ్ ఎఫ్ఎం ఆర్ జెలు ఈ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటారు, పర్యావరణ అనుకూల జీవనాన్ని మరింతగా ప్రోత్సహించడానికి కమ్యూనిటీ సభ్యులతో అర్థవంతమైన సంభాషణలలో పాల్గొంటారు.

రీ సస్టైనబిలిటీ నాయకత్వం మాటల్లో… :
రీ సస్టైనబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ గౌతం రెడ్డి మాట్లాడుతూ…“సస్టైనబిలిటీ అనేది ఒక అవకాశం కాదు ; మనకు , రాబోయే తరాలకు సురక్షితమైన భవిష్యత్తును నిర్ధారించడం కోసం మనం స్వీకరించాల్సిన బాధ్యత. రీ బిగ్ గ్రీన్ గణేశ వంటి కార్యక్రమాల ద్వారా, నీటి కాలుష్యాన్ని ఎదుర్కోవడంలో రీ సస్టైనబిలిటీ గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. ఈ పర్యావరణ అనుకూల ప్రచారం మన ముఖ్యమైన నీటి వనరులను సంరక్షించేలా, కీలకమైన పర్యావరణ అనుకూల పద్ధతులను విస్తృతంగా స్వీకరించడాన్ని ప్రేరేపించడానికి రూపొందించబడింది..” అని అన్నారు.

రీ సస్టైనబిలిటీ యొక్క సీఈఓ శ్రీ మసూద్ మల్లిక్ మాట్లాడుతూ..“దేశం అంతటా అపారమైన ఆనందం మరియు వేడుకల సమయంగా గణేష్ చతుర్థి నిలుస్తుంది. ఈ సంవత్సరం, మా ప్రతిష్టాత్మక కార్యక్రమం , భవిష్యత్తు తరాలకు ప్రకృతిని సంరక్షించే దిశగా బాధ్యత తీసుకోవాల్సిన సందేశాన్ని ముందుకు తీసుకువెళ్తుంది, ఇది మా ‘ మిషన్ లైఫ్’ సూత్రాలకు పూర్తి అనుగుణంగా ఉంటుంది. కొత్త మొక్కల ఎదుగుదలకు తోడ్పడే గణేశ విగ్రహాలను అందించడం మరియు కాగితం , ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం ద్వారా, పరిశుభ్రమైన, హరిత భారతావనిని సృష్టించాలనే మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాము . #రీ బిగ్ గ్రీన్ గణేశ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లడం ద్వారా గణేష్ చతుర్థిని వేడుక జరుపుకుందాం..” అని అన్నారు. వృత్తాకార ఆర్థిక వ్యవస్థ పట్ల తిరుగులేని నిబద్ధత ద్వారా పర్యావరణ పరిరక్షణ రంగంలో రీ సస్టైనబిలిటీ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. వ్యర్ధ నిర్వహణ పద్ధతులకు మార్గదర్శకత్వం వహించడం మరియు అత్యాధునిక సాంకేతికత , హరిత కార్యక్రమాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా, సస్టైనబిలిటీ ని ప్రోత్సహించడంలో రీ సస్టైనబిలిటీ అగ్రగామిగా కొనసాగుతోంది. బిగ్ గ్రీన్ గణేశ కార్యక్రమం, వేడుకల సమయంలో పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి రీ సస్టైనబిలిటీ యొక్క అంకితభావం తో చేస్తున్న ప్రయత్నాలకు ఉదాహరణగా నిలుస్తుంది .