Sovereign Bonds: రూ.1 లక్షకు రూ.3 లక్షలు ఇవ్వనున్న ఆర్బీఐ

ఎనిమిదేళ్ల క్రితం సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడులు పెట్టిన వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీపి కబురు అందించింది. 2016-17 సిరీస్-4 బాండ్ల మెచ్యూరిటీ తేదీని మార్చి 17గా నిర్ణయించడంతో, పెట్టుబడిదారులు దాదాపు మూడు రెట్ల లాభం పొందనున్నారు.
లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు దాదాపు రూ.3 లక్షలు
భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించే లక్ష్యంతో 2015 నవంబర్‌లో RBI ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ బాండ్ల కాలపరిమితి 8 సంవత్సరాలు. 2017 మార్చిలో జారీ చేసిన నాల్గవ విడత బాండ్ల మెచ్యూరిటీ ధరను తాజాగా RBI ప్రకటించింది. ఆ సమయంలో గ్రాముకు రూ.2,943 చొప్పున బాండ్లను జారీ చేయగా, ప్రస్తుత ధరను రూ.8,624గా నిర్ణయించారు. దీని ప్రకారం, అప్పట్లో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు దాదాపు రూ.3 లక్షలు లభిస్తాయి. దీనికి అదనంగా, బాండ్లపై ఏటా 2.50 శాతం వడ్డీ కూడా లభిస్తుంది.

Advertisements
రూ.1 లక్షకు రూ.3 లక్షలు ఇవ్వనున్న ఆర్బీఐ


సగటు ధరను పరిగణనలోకి ..
గ్రాము ధరను నిర్ణయించడానికి, మెచ్యూరిటీ తేదీకి ముందు వారం రోజులపాటు 999 స్వచ్ఛత కలిగిన బంగారం ధరను ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ నిర్ణయించిన సగటు ధరను పరిగణనలోకి తీసుకుంటారు. అదేవిధంగా, 2019-20 సిరీస్-4 సంబంధించిన ప్రీ-మెచ్యూరిటీ విండోను కూడా మార్చి 17గా నిర్ణయించారు. దీనికి గ్రాము ధరను రూ.8,634గా నిర్ణయించారు. ఈ ధరను నిర్ణయించడానికి మెచ్యూరిటీకి ముందు వారం చివరి మూడు పని దినాలను (మార్చి 11, 12, 13 తేదీలు) పరిగణనలోకి తీసుకుంటారు.
మెచ్యూరిటీకి సావరిన్ గోల్డ్ బాండ్లు
అంతర్జాతీయంగా బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరిన సమయంలో సావరిన్ గోల్డ్ బాండ్లు మెచ్యూరిటీకి రావడంతో పెట్టుబడిదారులకు ఇది నిజంగానే పండగలాంటి సమయం.

Related Posts
Qatar: ఖతార్ లోభారతీయ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అరెస్ట్..ఎందుకంటే?
Qatar: ఖతార్‌లో టెక్ మహీంద్రా ఉద్యోగి అమిత్ గుప్తా అరెస్ట్

ఖతార్‌లో భారత సాంకేతిక రంగానికి చెందిన ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ ఐటీ కంపెనీ టెక్ మహీంద్రాలో సీనియర్ ఉద్యోగిగా పని చేస్తున్న అమిత్ Read more

రాజకీయ ప్రశ్నలు అడగొద్దు అంటున్న రజనీకాంత్!
రాజకీయ ప్రశ్నలు అడగొద్దు అంటున్న రజనీకాంత్!

తమిళనాడులో మహిళల భద్రతకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ నిరాకరించారు. జనవరి 7న, తన రాబోయే చిత్రం 'కూలీ' షూటింగ్ కోసం థాయిలాండ్ Read more

కాంగ్రెస్ ఎంపీ – రకీబుల్ హుస్సేన్‌పై దాడి
కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సేన్ పై జరిగిన దాడి

అస్సాం కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సేన్‌పై దాడి – అసలు సంగతి ఏమిటి? అస్సాంలో రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. నాగావ్ జిల్లాలో కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ Read more

 ఇండిగోపై శృతిహాసన్ ఫైర్.. స్పందించిన ఎయిర్‌లైన్స్‌
cr 20241011tn670904ed65da7

శృతిహాసన్, ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై అసంతృప్తి: విమానం 4 గంటలు ఆలస్యంగా రావడం దేశీయ విమానయాన సంస్థ అయిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై ప్రముఖ నటి శృతిహాసన్ అసహనాన్ని వ్యక్తం Read more

×