తొమ్మిదోసారి కీలక వడ్డీరేట్లలో మార్పు లేదు

rbi-holds-key-interest-rate-steady-at-6.5-citing-high-food-prices

ముంబయి: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఈరోజు మానిట‌రీ పాల‌సీ రిపోర్టును రిలీజ్ చేసింది. కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. మంగళవారం ప్రారంభమైన పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం ప్రకటించారు. రెపోరేటు ను 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు దీన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది. ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది తొమ్మిదోసారి.

ఎంపీసీ కీలక నిర్ణయాలు..

. మార్కెట్‌ అంచనాలు, ఆర్‌బీఐ విధానాలకు మధ్య సయోధ్య కుదురుతోంది.
. ఏప్రిల్‌ – మేలో స్థిరంగా ఉన్న ద్రవ్యోల్బణం.. జూన్‌లో మళ్లీ పెరిగింది. ఆహార .పదార్థాల ధరలు పెరగడమే దీనికి కారణం.
. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విస్తరణ అసమతుల్యంగా ఉంది. కొన్ని కేంద్ర .బ్యాంకులు ఇంకా కఠిన విధానాలను కొనసాగిస్తున్నాయి. పెరుగుతున్న .అప్పులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సవాల్‌గా మారాయి.
. భారత సేవా రంగ కార్యకలాపాలు బలంగా ఉన్నాయి.
. బ్యాంకు రుణాల విస్తరణ నేపథ్యంలో ప్రైవేటు కార్పొరేట్‌ పెట్టుబడులు .ఊపందుకుంటున్నాయి. బ్యాంకులు, కార్పొరేట్ల బ్యాలెన్స్‌ షీట్లు ఆరోగ్యకరంగా .ఉన్నాయి. ప్రభుత్వం మూలధనం వ్యయాలపై దృష్టి సారిస్తోంది. .ఈనేపథ్యంలో పెట్టుబడి అవకాశాలు ఆశాజనకంగా ఉన్నాయి.
. 2024-25లో వాస్తవ జీడీపీ వృద్ధిరేటు అంచనా 7.2 శాతం. ఒకటి, రెండు, .నాలుగో త్రైమాసికంలో 7.2 శాతం, మూడో క్వార్టర్‌లో 7.3 శాతంగా ఉండే అవకాశం.
. నైరుతి రుతుపవనాల వల్ల ఆహార ద్రవ్యోల్బణం దిగొస్తుందని ఆశాభావం.
. 2024-25లో ద్రవ్యోల్బణం 4.5 శాతంగా అంచనా. రెండో త్రైమాసికంలో 4.4%, .మూడో త్రైమాసికంలో 4.7%, నాలుగో త్రైమాసికంలో 4.3 శాతంగా ఉండే అవకాశం.
. భారత కరెన్సీ రూపాయి మారకం విలువ పరిమిత శ్రేణిలోనే కదలాడుతోంది.
. ఆగస్టు రెండు నాటికి భారత విదేశీ మారక నిల్వలు 675 బిలియన్‌ డాలర్ల వద్ద రికార్డు స్థాయికి చేరాయి.
. రిటైల్‌ ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడి అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకుల డిపాజిట్లు తగ్గుతున్నాయి. దీంతో బ్యాంకులు క్రెడిట్‌ డిమాండ్‌ను అందుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. .కుటుంబాల పొదుపులను ఆకర్షించడంపై బ్యాంకులు దృష్టి సారించాలి.
. వ్యక్తిగత రుణ వితరణలో గణనీయ వృద్ధి. దీన్ని జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.
. ఆర్థిక సంస్థలు కొన్నిసార్లు టాపప్‌ లోన్లు, బంగారు రుణాలను ఇవ్వడంలో నిబంధనలను పాటించడం లేదు. దీన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు అరికట్టాలి.
. ఇటీవల గ్లోబల్‌ టెక్‌ ఔటేజ్‌.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రత్యామ్నాయ వ్యవస్థల ఏర్పాటు ప్రాముఖ్యతను గుర్తుచేసింది.
. యూపీఐ పన్ను చెల్లింపు పరిమితి రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు.
నిరంతర చెక్‌ క్లియరింగ్‌ను ప్రవేశపెట్టాలని ప్రతిపాదన.
. 2022-23లో జీడీపీలో 2 శాతంగా ఉన్న కరెంటు ఖాతా లోటు 2023-24 నాటికి 0.7 శాతానికి తగ్గింది.