ఐపీఎల్ 2025 సీజన్ ఇప్పటికే అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తున్న సమయంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ , చెన్నై సూపర్ కింగ్స్ జట్లలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.ఇప్పటికే రుతురాజ్ గైక్వాడ్, పేసర్ లాకీ ఫెర్గూసన్‌లు మెగా టోర్నీకి దూరమయ్యారు. తాజాగా సన్‌రైజర్స్ హైదారబాద్ స్టార్ స్పిన్నర్ ఆడం జంపా సైతం గాయపడ్డాడు. దాంతో, అతడు 18వ ఎడిషన్ నుంచి నిష్క్రమించాడు. భుజం గాయంతో బాధ పడుతున్న జంపా విశ్రాంతి తీసుకోనున్నాడు.అతడి స్థానంలో కర్నాటకకు చెందిన స్మరణ్ రవిచంద్రన్ ను స్క్వాడ్‌లోకి తీసుకుంది హైదరాబాద్ ఫ్రాంచైజీ. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించింది సన్‌రైజర్స్. ‘స్క్వాడ్‌లోకి స్వాగతం. గాయం కారణంగా ఐపీఎల్ మిగతా మ్యాచ్‌లకు దూరమైన ఆడం జంపా స్థానంలో స్మరణ్ రవిచంద్రన్ జట్టుతో కలవనున్నాడు’ అని తమ పోస్ట్‌లో రాసుకొచ్చిందీ ఫ్రాంచైజీ.
ఆడం జంపా
ఈ సీజన్‌లో ఆడం జంపా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. రెండు మ్యాచుల్లో ఇంప్యాక్ట్ సబ్‌గా ఆడిన ఈ లెగ్ స్పిన్నర్ ధారాళంగా పరుగులు ఇవ్వడమే కాకుండా 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అంతలోనే భుజం నొప్పి కారణంగా డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం అయ్యాడు జంపా. కోలుకునేందుకు ఎక్కువ సమయం పట్టనుడడడంతో అతడికి విశ్రాంతి ఇవ్వాలని సన్‌రైజర్స్ యాజమాన్యం భావించింది. అందుకే అతడి స్థానంలో టీ20ల్లో దంచి కొడుతున్న 21 ఏళ్ల రవిచంద్రన్‌ను తీసుకుంది.ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన ఈ యంగ్‌స్టర్ ఈమధ్యే డీపై పాటిల్ కప్‌లో చితక్కొట్టాడు. గత ఏడాది పొట్టి ఫార్మాట్‌లో రవిచంద్రన్ 45.14 సగటు.. 125.2 స్ట్రయిక్ రేటుతో 302 రన్స్ సాధించాడు. దాంతో, మిడిలార్డర్‌లో చెకలరేగి ఆడేందుకు పనికొస్తాడనే ఉద్దేశంతో రవిచంద్రన్‌కు జై కొట్టింది హైదరాబాద్ టాలెంట్ స్కౌట్. ఈ సీజన్‌లో ఆడుతున్నందుకు ఈ చిచ్చరపిడుగుకు ఆరెంజ్ ఆర్మీ రూ. 30 లక్షలు చెల్లించనుంది. ఏప్రిల్ 12న ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌పై 246 పరుగుల రికార్డు ఛేదనతో అదరగొట్టిన కమిన్స్ సేన తదుపరి పోరులో ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. ఏప్రిల్ 17న వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది.

ఆయుష్ మాత్రే
మోచేతి గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో ఆ జట్టు ముంబై క్రికెటర్ ఆయుష్ మాత్రేను తీసుకుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ నిర్వాహకులు సోమవారం ఓ ప్రకటనలో తెలియజేశారు.ఆయుష్ మాత్రే ముంబై తరఫున 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 7 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడి 962 పరుగులు చేశాడు. అతన్ని సీఎస్‌కే రూ. 30 లక్షల కనీస ధరకు తీసుకుంది. కర్ణాటక బ్యాటర్ స్మరన్ రవిచంద్రన్ 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లతో పాటు 10 లిస్ట్ ఏ గేమ్స్ ఆడి 1100 పరుగులు చేశాడు. అతన్ని కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 30 లక్షలకు జట్టులోకి తీసుకుంది.
Read Also: IPL 2025: నూర్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు:ధోని