ratan tata dies

రతన్ టాటా ఇక లేరు

ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా (86) మరణించారు. అనారోగ్యంతో గత అర్ధరాత్రి ముంబైలోని బ్రీచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో నావల్ టాటా, సోనీ టాటా దంపతులకు జన్మించారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. రతన్ ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో రతన్ టాటా ఒకరు. 1991 నుంచి 2012 వరకు టాటా గ్రూప్ కు చైర్మన్ గా కొనసాగారు. ఆయన హయాంలో టాటా కంపెనీని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేశాడు. అంతేకాకుండా ప్రముఖ టెట్లీ, కోరస్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి ప్రధాన కంపెనీలను సైతం కొనుగోలు చేసింది. ఇలా క్రమక్రమంగా టాటా దేశీయ సంస్థ నుంచి గ్లోబల్ పవర్ హౌస్ గా మారింది.

ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు.. టాటా నానోను ఈయన హయాంలో ప్రవేశ పెట్టడం విశేషం. అదేవిధంగా దాని సాఫ్ట్ వేర్ సేవల విభాగం టాటా కన్సల్టెన్సీ -టీసీఎస్ ను ప్రపంచ ఐటీ అగ్రగామీగా విస్తరింపజేశారు. 2012లో చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. ఆ తరువాత టాటా సన్స్ మరియు టాటా మోటార్స్, టాటా స్టీల్ తో సహా ఇతర గ్రూప్ కంపెనీలకు చైర్మన్ ఎమెరిటస్ గా ఎంపికయ్యారు.1961లో టాటా స్టీల్లో ఉద్యోగంలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి 1991-2012 వరకు టాటా గ్రూప్ ఛైర్మన్ గా ఉన్నారు. తన నాయకత్వంలో టాటా గ్రూప్లో అనేక సంస్కరణలు చేపట్టారు. రతన్ టాటా మరణ వార్త యావత్ భారతీయులను కలిచివేస్తోంది. ‘నేషన్ ఫస్ట్’ అని నమ్మిన ఆయన, తన సంస్థనే కాకుండా పారిశ్రామిక రంగంలో దేశాన్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లారని అంత గుర్తు చేసుకుంటున్నారు. రతన్ గొప్ప మానవతావాది అని ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అంటూ ప్రశంసిస్తున్నారు.

Related Posts
మన్మోహన్ సింగ్ స్మారక స్థలం ఎక్కడ?
మన్మోహన్ సింగ్ స్మారక స్థలం ఎక్కడ?

కేంద్రం, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ స్మారకాన్ని నిర్మించడానికి సంబంధించి ప్రతిపాదిత స్థలాలను, ఎంపికలను ఆయన కుటుంబ సభ్యులకు పంపాలని సూచించింది. రాజ్‌ఘాట్, రాష్ట్రీయ స్మృతి Read more

ఏపీఎస్ఆర్టీసీ శివరాత్రి ఆఫర్
Mahashivaratri 2025

మహాకుంభమేళా వేడుకల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ భక్తులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. రాజమండ్రి ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ఫిబ్రవరి 18న ప్రత్యేక బస్సు ప్రారంభం కానుంది. ఈ బస్సు Read more

చరణ్ పై మెగాస్టార్ ప్రశంసలు
chiru tweet

గేమ్ ఛేంజర్ మూవీ లో రామ్ చరణ్ నటనపై మెగాస్టార్ చిరంజీవి ట్విటర్లో ప్రశంసలు కురిపించారు. 'నిజాయితీ కలిగిన అప్పన్నగా, ఐఏఎస్ అధికారి రామ్నందన్గా చరణ్ అద్భుతంగా Read more

మావోయిస్టు కీలక నేత కల్పన అలియాస్ సుజాత అరెస్ట్: ఆమెపై రూ. కోటి రివార్డు
Police Arrests Maoist Prime Leader Sujatha in Kothagudem

ఖమ్మం: వరుస ఎన్‌కౌంటర్లతో భారీగా క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు కీలక నేత సుజాతను పోలీసులు పట్టుకున్నారు. కొత్తగూడెంలోని దవాఖానలో చికిత్స కోసం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *