కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ పేరు తెగ చక్కర్లు కొడుతోంది – అదేఅలేఖ్య చిట్టి పికిల్స్. రాజమండ్రి కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకే కాకుండా దేశవిదేశాలకు కూడా ఆర్డర్ల మీద వీళ్లు పచ్చళ్లు చేసి పంపిస్తుంటారు. జస్ట్ వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ పెడితే చాలు వాళ్ల దగ్గరున్న పచ్చళ్లు, వాటి రేట్ల వివరాలను మనకు పంపించేస్తారు. వీళ్ల పచ్చళ్లు టేస్టీగా ఉంటాయని పేరు రావడంతో సహజంగానే డిమాండ్ పెరిగింది. అయితే వీళ్ల పచ్చళ్ల రేటు కూడా ఎక్కువే. నాన్ వెజ్ పచ్చళ్లతో ఫేమస్ అయిన ముగ్గురు అక్క చెల్లెళ్ల వ్యాపారమే ఇది. తక్కువ సమయంలోనే పచ్చళ్ల వ్యాపారంలో వీరు ముగ్గురు సక్సెస్ అయ్యారు. వీరి పచ్చళ్లకు మంచి పేరు వచ్చింది. నెట్టింట వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కొన్ని రోజులుగా విజయవంతంగా సాగుతున్న ఈ పచ్చళ్ల వ్యాపారంలో వారు మాట్లాడిన బూతు మాటలే కొంపముంచాయి.ఇటీవల ఓ వ్యక్తి అలేఖ్య పికిల్స్‌కు హాయ్ అని వాట్సాప్ చేస్తే, అటు నుంచి పచ్చళ్ల రేట్లు పెట్టారు. నాన్ వెజ్ పచ్చళ్లు అరకిలో తక్కువలో తక్కువగా రూ.1200 ఉండటంతో రెండు చేతులు జోడించిన ఎమోజీలతో రిప్లయ్ ఇచ్చాడు. మీ పచ్చళ్లు ఇంత ధర ఎందుకున్నాయో నాకు అర్థం కావడం లేదని ప్రశ్నించాడు. దీనికి అట్నుంచి ఆడ గొంతుతోబూతులతో కూడిన వాయిస్ మెసేజ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.దీంతో వీరిపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీడియో విడుదల
సోషల్ మీడియా లో వీరి వ్యాపారంపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ రావడంతో దెబ్బకు అలేఖ్య చిట్టి పికిల్స్ వెబ్ సైట్ క్లోజ్ చేశారు. వాట్సప్ సైతం డీయాక్టివేట్ చేశారు. ఇక తాజాగా ఈ ఆడియో మెసేజ్ పై ముగ్గురు అక్కచెల్లెళ్లలో ఒకరైన సుమ కంచర్ల ఈ వివాదం రియాక్ట్ అవుతూ ఓ వీడియో చేసింది. తనను ట్రోల్ చేయవద్దని రిక్వెస్ట్ చేసింది.ముగ్గురు అక్కాచెల్లెళ్లలో ఒకరైన రమ్య కంచర్ల సైతం ఈ వివాదం పై ఓ వీడియో విడుదల చేసింది. ఒకరికి మెసేజ్ పెట్టబోయి ఇంకొకరికి పెట్టినట్లు రమ్య చెప్పుకొచ్చింది. అందులో వినిపించిన ఆ వాయిస్ తన అక్క అలేఖ్యదే అని అంగీకరించింది. తమకు రోజుకు వేల సంఖ్యలో ఆర్డర్స్ వస్తాయని అందులో కొందరు తమను బూతులు తిడతారని అలాంటి వ్యక్తులను బ్లాక్ చేస్తామని కొన్నిసార్లు ఆ విధమైన రిప్లై ఇస్తామని చెప్పుకొచ్చింది రమ్య మోక్ష. వైరల్ అయిన ఆడియో క్లిప్ విని విమర్శించే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలని రిక్వెస్ట్ చేసింది. వేరే వ్యక్తికి పంపాల్సిన రిప్లై అనుకోకుండా మరో వ్యక్తికి వచ్చిందని ఆ వెంటనే అతడికి క్షమాపణలు చెప్పినట్లు వివరించింది.
నెటిజన్లు ట్రోలింగ్
మీ చిట్టి రొయ్యల పచ్చడి తిని నా భార్యకు గర్భం వచ్చిందంటూ ఓ వ్యక్తి సెటైరికల్‌గా వీడియో కింద మెసేజ్ పెడితే రియల్లీ కంగ్రాట్స్ అంటూ అట్నుంచి సమాధానం వచ్చింది. ఇది కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. పచ్చళ్ల వ్యాపారంలో నిలదొక్కుకోవాలంటే పచ్చళ్లు బాగా పెడితే మాత్రమే సరిపోదు. మనం సోషల్ మీడియాలో ఇచ్చే రిప్లయ్‌లు కూడా ఎంతో హుందాగా మన గౌరవాన్ని పెంచేలా ఉండాలని అలేఖ్య పికెల్స్ ఉదంతం చెబుతోంది.ఆ కస్టమర్ వినయంగా ప్రశ్నిస్తే, అంత దారుణంగా మాట్లాడడం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్లు ట్రోలింగ్ ఎక్కువయ్యే సరికి అలేఖ్య చిట్టి పికెల్స్ ఫోన్ నెంబర్ ను తాత్కాలింకంగా నిలిపివేశారు. అటు వాట్సాప్ అకౌంట్ ను కూడా డిలీట్ చేశారు. ఇన్ స్టాలో కూడా ఓపెన్ అవ్వడం లేదు. ప్రస్తుతం వెబ్ సైట్ కూడా ఓపెన్ కావడం లేదు. మంచి అవకాశాన్ని వినియోగించుకోకుండా ఇలా ఓవర్ యాక్షన్ చేయడం ఏంటంటూ నిందిస్తున్నారు.