కన్నడ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన రామ్ చరణ్..?

RRR తో పాన్ ఇండియా హిట్ అందుకోవడమే కాదు దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో క్రేజ్ సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..ప్రస్తుతం విభిన్న కథలపై ఫోకస్ పెట్టాడు. టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ ను వెతికి పట్టుకొని వారితో సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే మరికొన్ని కథలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో కన్నడ డైరెక్టర్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

కన్నడ స్టార్ డైరెక్టర్ నర్తన్ కు ఓకే చెప్పాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. “మఫ్టీ” అనే సినిమాతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. రీసెంట్ గా ఈయన చరణ్ కు ఓ కథ చెప్పగా..ఆ కథ చరణ్ కు బాగా నచ్చిందట. దీంతో వెంటనే సినిమా చేద్దాం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబదించిన అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.

ఇక చరణ్ – శంకర్ సినిమా విషయానికి వస్తే…ఈ మూవీ లో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా తాలూకా పిక్స్ ఇప్పటికే కొన్ని బయటకు వచ్చి సినిమా ఫై అంచనాలు పెంచాయి. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.