రాజీవ్ విగ్రహంపై వివాదం.. రాష్ట్రంలో BRS ఆందోళనలు

సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బిఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ క్రమంలో నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు పిలుపునిచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు అన్ని నియోజకవర్గాలలో తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయడం మొదలుపెట్టారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుచేసి తెలంగాణ తల్లిని సీఎం రేవంత్ అవమానించారని కేటీఆర్ విమర్శిస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ వల్లే, సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రేవంత్‌రెడ్డి పేర్కొనడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్‌రెడ్డికి అమరుల త్యా గాలు గుర్తుకు రావడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ వస్తే వందలమంది విద్యార్థులు ఎందుకు బలయ్యారని నిలదీస్తున్నారు. తెలంగాణ ప్రజలు, అమరుల త్యాగాలను పక్కన పెట్టి కేవలం సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.