Rajini should recover soon.CM Stalin on Rajinikanth health

రజనీ త్వరగా కోలుకోవాలి..రజనీకాంత్‌ ఆరోగ్యంపై సీఎం స్టాలిన్‌

Rajini should recover soon..CM Stalin on Rajinikanth health

న్యూఢిల్లీ: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌ ఆరోగ్యంపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సైతం రజనీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘ఆసుపత్రిలో చేరిన నా స్నేహితుడు రజనీకాంత్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. అదే సమయంలో, ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి కూడా నటుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

రజనీకాంత్‌ తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నైలోని అపోలో దవాఖానకు తరలించారు. కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ సాయి సతీశ్‌ ఆధ్వర్యంలోని ప్రత్యేక వైద్యుల బృందం సూపర్‌స్టార్‌కు చికిత్స అందిస్తున్నదని హాస్పిటల్‌ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు.

కాగా, గతంలో కూడా రజనీకాంత్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 2020 డిసెంబర్‌లో హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సూపర్‌స్టార్‌.. రక్తపోటులో తీవ్ర హెచ్చుతగ్గులు రావడంతో జూబ్లీహిల్స్‌ అపోలో దవాఖానలో చేరారు. ప్రత్యేక ఐసీయూకు తరలించి రక్తపోటులో హెచ్చుతగ్గులను నియంత్రించారు.

Related Posts
ఆంధ్రప్రదేశ్‌లో రూ.47,776 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్‌లో రూ.47,776 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) రూ. 44,776 కోట్ల పెట్టుబడులతో కూడిన 15 ప్రాజెక్టులకు గురువారం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు Read more

విజయవాడలో 25వ ఏప్రిలియా RS457ను డెలివరీ చేసిన ఇన్నోవియా మోటర్స్
Innovia Motors delivered Aprilia RS457 on 25th in Vijayawada

విజయవాడ: పియాజియో ఇండియా యొక్క ప్రతిష్టాత్మక ద్వి చక్ర వాహన బ్రాండ్‌లు వెస్పా మరియు ఏప్రిలియా కోసం అధీకృత రిటైలర్ అయిన ఇన్నోవియా మోటర్స్, ఈరోజు విజయవాడలోని Read more

రాహుల్ గాంధీ వియత్నాం పర్యటన: బీజేపీ ఆరోపణ
రాహుల్ గాంధీ వియత్నాం పర్యటన: బీజేపీ ఆరోపణ

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరియు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనకు వెళ్లిన విషయం పట్ల బీజేపీ తీవ్ర ఆగ్రహం Read more

ఓటిటిలోకి రానున్న సందడి సినిమాలు
టెస్ట్ మాధవన్, నయనతార, సిద్ధార్థ్

ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ త్వరలో ప్రేక్షకులకు ఎన్నో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను అందించనుంది.ఇందులో తెలుగు,హిందీతో పాటు పలు దక్షిణాది భాషల సినిమాలు కూడా ఉన్నాయి.కీర్తి సురేష్ Read more