‘కల్కి’పై రాజమౌళి కామెంట్స్

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కి 2898 AD తెరకెక్కింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణె, దిశా పటాని, యూనివర్స్ స్టార్ కమల్ హాసన్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, సీనియర్ నటి శోభన, మాళవిక నాయర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు సినిమా అద్భుతంగా తెరకెక్కించారని..నటి నటులంతా ఎంతో బాగా నటించారని..టెక్నీకల్ టీం బాగా వర్క్ చేసారని..ఇక డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి ఎంత చెప్పిన తక్కువే అంటున్నారు.

ఇదిలా ఉండగా ‘కల్కి’ మూవీపై దర్శకుడు రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. కల్కి ప్రపంచం తనకెంతో నచ్చిందని, అద్భుతమైన టేకింగ్తో అదరగొట్టారన్నారు. ప్రభాస్ టైమింగ్ అదిరిపోయిందని, అమితాబ్, కమల్ హాసన్, దీపిక సపోర్ట్ అద్భుతమని పేర్కొన్నారు. చివరి 30 నిమిషాల సినిమా తనను పూర్తిగా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిందన్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్, వైజయంతి టీమ్ అసాధారణ ప్రయత్నాన్ని అభినందించారు.