the rajasab 290724 3

Raja Saab: ‘రాజాసాబ్’ నుంచి క్రేజీ అప్‌డేట్‌… మెస్మ‌రైజింగ్ లుక్‌తో అద‌ర‌గొట్టిన‌ డార్లింగ్!

రెబల్‌ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త సినిమా ‘ది రాజాసాబ్’ ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ప్రక్షకుల్లో ఎంతో ఆసక్తి రేపుతోంది ఈ చిత్రం కామెడీ హర్రర్ థ్రిల్లర్ అంశాలను మిళితం చేసుకుని విభిన్నమైన కథనంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది సినిమా ప్రారంభం నుండి ప్రతీ అప్‌డేట్ అభిమానులను ఆకట్టుకుంటుండగా ఇటీవల విడుదలైన పోస్టర్‌లు గ్లింప్స్ మరింత ఉత్కంఠ పెంచాయి ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23) సందర్భంగా సినిమా మేకర్స్ అభిమానులకు ప్రత్యేక ట్రీట్‌ ఇవ్వబోతున్నారు అయితే పుట్టినరోజు రోజుకు రెండు రోజుల ముందుగానే కొత్త పోస్టర్‌ను విడుదల చేయడం విశేషం ఈ పోస్టర్‌లో ప్రభాస్ మెస్మరైజ్ చేసే లుక్‌ ప్రేక్షకులను ఆకట్టుకోగా అక్టోబర్ 23న ప్రత్యేక టీజర్ రానుందని ప్రకటించారు ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ మాళవిక మోహనన్ కథానాయికలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు 2025 వేసవి సందర్భంగా ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇక ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే, ఇటీవల ‘సలార్’ ‘కల్కి 2898’ లాంటి వరుస బ్లాక్‌బస్టర్‌లతో సక్సెస్ ట్రాక్‌లో నడుస్తున్నారు ‘బాహుబలి’ సిరీస్‌ తరువాత కొన్ని ప్లాప్‌లను ఎదుర్కొన్నప్పటికీ ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్‌కి కొత్త గ్లోరీని తెచ్చుకుంటున్నారు ‘ది రాజాసాబ్’ తో ఆయన మరింత పాన్ ఇండియా రేంజ్‌లో మరో భారీ హిట్‌ అందుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Related Posts
మర్డర్‌ మిస్టరీగా విజయ్‌ ఆంటోని ‘గగన మార్గన్’
vijay antony

నటుడిగా దర్శకుడిగా గీత రచయితగా సంగీత దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకున్న విజయ్ ఆంటోని ఇప్పుడు మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌లో నటించనున్నాడు ఈ చిత్రం డిటెక్టివ్ Read more

కార్తికేయ, హనుమాన్‌, కల్కి కోవలోనే రహస్యం ఇదం జగత్‌ : దర్శకుడు కోమల్‌ ఆర్‌.భరద్వాజ్‌
rahasyam idam jagath

మన పురాణాలు, ఇతిహాసాలు, శ్రీచక్రం వంటి ఆధ్యాత్మిక అంశాల చుట్టూ తిరిగే కథతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచబోతున్న సినిమా "రహస్యం ఇదం జగత్‌ నవంబర్ 8న Read more

Samantha : నాగ చైతన్య విషయంలో నేను అలా ప్రవర్తించి ఉండాల్సింది..తప్పు చేశా అంటూ సమంత షాకింగ్ కామెంట్స్
samantha

సమంత మరియు నాగ చైతన్య వీరిమధ్య విడాకులు గురించి తరచూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉంటాయి వీరిద్దరి విడాకులకు కారణం ఏమిటి అన్నది ఎంతో మందికి Read more

చిత్రం దేవకీ నందన వాసుదేవ అతిథులుగా విచ్చేసిన రానా దగ్గుబాటి
devaki nandana

యువ కథానాయకుడు అశోక్‌ గల్లా నటిస్తున్న దేవకీ నందన వాసుదేవ చిత్రం నవంబర్‌ 22న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. అర్జున్‌ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని Read more