రాజ్ తరుణ్ లవర్ లావణ్య ఆత్మహత్య యత్నం

రాజ్ తరుణ్ – లావణ్య ల వ్యవహారం రోజు రోజుకు అనేక మలుపులు తిరుగుతుంది. ప్రేమిస్తున్నానని , పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరై..మరో హీరోయిన్ మాయలో పడి తనను దూరం చేసాడని చెప్పి లావణ్య అనే యువతీ నర్సింగ్ పోలీసులకు పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిర్యాదు తర్వాత సరైన ఆధారాలు లేవని చెప్పి..రివర్స్ లో పోలీసులు లావణ్య ఫై కేసు ఫైల్ చేసారు.

తర్వాత లావణ్య సాక్ష్యాలతో పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీసులకు అందజేయడం తో పోలీసులు రాజ్ తరుణ్ ఫై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే శుక్రవారం అర్ధరాత్రి చనిపోతున్నానంటూ లావణ్య తన తరుపు లాయర్ ఫోన్ చేయడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం వారు సమయానికి వెళ్లి ఆమె ఇంటికి వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి కాపాడారు. ‘రాజ్ లేని ప్రపంచంలో నేను ఉండలేను. కానీ అతడు మారిపోయాడు. నా చావును కోరుకున్నాడు. దీనంతటికి మాల్వీనే కారణం. నా దగ్గరి వాళ్లు కూడా నన్ను అర్థం చేసుకోలేదు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.