అమరావతికి మరో శుభవార్త

ఏపీకి వరుస గుడ్ న్యూస్ లు అందిస్తుంది కేంద్రం. మంగళవారం బడ్జెట్ లో ఏపీకి పెద్ద ఎత్తున నిధులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిధులపై ఇతర రాష్ట్రాలు మండిపడుతున్నాయి. బడ్జెట్ కేవలం ఏపీ, బీహార్ కోసమే జరిగిందన్నట్లు విమర్శలు చేస్తుండగా..అమరావతికి మరో తీపి కబురు అందించింది కేంద్రం.

రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ 56KM మేర రూ.2047 కోట్లతో కొత్త రైల్వే లైన్ నిర్మిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు DPRను నీతి ఆయోగ్ ఆమోదించిందన్నారు. మరిన్ని అనుమతుల కోసం సమయం పడుతుందన్నారు. కాగా ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య నిర్మించే ఈ లైన్లో 9 కొత్త రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు. కొత్తపేట-వడ్డమాను మధ్య కృష్ణా నదిపై 3KM వంతెన నిర్మిస్తారు. ఈ ప్రకటన తో మరోసారి రాష్ట్ర ప్రజలు కేంద్రం ఫై హర్షం వ్యక్తం చేస్తున్నారు.