నాపై ఈడీ రైడ్స్ జరగొచ్చు – రాహుల్

తనపై ఈడీ దాడులు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇటీవల లోక్సభలో తాను మాట్లాడిన ‘చక్రవ్యూహం’ స్పీచ్ కొంతమందికి నచ్చలేదన్నారు. రైడ్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఈడీలో ఉన్న కొందరు చెప్పినట్లు తెలిపారు. ‘ఈడీని సాదరంగా ఆహ్వానిస్తున్నా. మీకోసం చాయ్, బిస్కట్లు సిద్ధంగా ఉన్నాయి’ అని రాహుల్ రాసుకొచ్చారు.

అంతకు ముందు లోక్ సభ లో రాహుల్ ఏమన్నారంటే..

కేంద్ర బడ్జెట్‌పై జరుగుతున్న చర్చలో భాగంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని ‘పద్మవ్యూహం’లోకి నెట్టివేస్తున్నారని మండిపడ్డారు. మహభారతంలో అభిమన్యుడిని చక్రవ్యూహంలో ఎలా హత్య చేశారో, ఇప్పుడు దేశాన్ని అలానే తయారు చేస్తున్నారని విమర్శించారు.
యువత, రైతులు, మహిళలు, చిన్న, మధ్య తరహా వ్యాపారుల చుట్టూ దాన్ని పన్నుతున్నారు.

చక్రవ్యూహం వెనుక మూడు శక్తులు ఉన్నాయి. పద్మవ్యూహం పన్నిన వారిలో ఆరుగురే ఉన్నారని రాహుల్ విమర్శలు గుప్పించారు. చక్రవ్యూహం వెనుక మూడు శక్తులు ఉన్నాయని, దేశ సంపద మొత్తాన్ని కబళించాలని చూస్తున్న ఇద్దరు వ్యక్తులు మొదటి శక్తిగా గుర్తించారు. ఇక దర్యాప్త సంస్థలైన సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ రెండదని చెప్పారు. మరోవైపు రాజకీయ కార్యనిర్వాహక వర్గాన్ని మూడో శక్తిగా రాహుల్ వివరించారు.