Ragi in ration in AP.. Distribution ration shops from June

Ration shops : ఏపీలో రేషన్‌లో రాగులు.. జూన్ నుంచి పంపిణీ రేషన్‌ షాపులు

Ration shops : ఏపీ ప్రభుత్వం రేషన్‌ లబ్ధిదారులకు బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమ పిండితో పాటుగా తృణధాన్యాలను కూడా పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే జూన్‌ నెల నుంచి రేషన్‌కార్డులు ఉన్నవారికి రాగులు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతుండగా.. ఈ మేరకు అవసరమైన సన్నాహాలు చేస్తోంది. రేషన్‌కార్డులు ఉన్నవారు రేషన్‌ బియ్యానికి బదులుగా రాగులు ఉచితంగా పంపిణీ చేయనున్నారు.

Advertisements
ఏపీలో రేషన్‌లో రాగులు జూన్

రెండు కేజీలు రాగులు

ప్రతినెలా 20 కిలోల బియ్యం తీసుకునే కుటుంబం రెండు కేజీలు రాగులు కావాలనుకుంటే.. ఆ మేరకు ఇచ్చే బియ్యాన్ని మినహాయించేలా ప్లాన్ చేశారు అధికారులు. అయితే ఏడాదికి దాదాపు 25 వేల మెట్రిక్‌ టన్నుల రాగులు అవసరమవుతాయని పౌరసరఫరాల సంస్థ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు రాగులు సేకరించేందుకు తాజాగా టెండర్‌ నోటీసు జారీ చేసింది. జూన్ నెల నుంచి రాగుల్ని పంపిణీ చేసేందుకు ప్లాన్ చేశారు. ఏపీలో రేషన్‌ కార్డుదారులు ఉన్నవారికి ఈ నెలలోనూ కూడా కందిపప్పు అరకొరగా అందుతున్నాయి. ఈ నెల కూడా బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్నారు.

ఈ నెలలో కార్డుదారులకు బియ్యం, పంచదార మాత్రమే

గత రెండు మూడు నెలలుగా కందిపప్పు పంపిణీ నిలిచిపోగా.. మార్చిలో ఇస్తారని భావించారు. అయితే ఏప్రిల్‌లో అయినా కందిపప్పు ఇస్తారని లబ్ధిదారులు అనుకున్నారు. ఈ నెలా సరిపడా కందిపప్పు రాలేదని ఎండీయూ వాహనాల సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం బయట మార్కెట్లో కిలో కందిపప్పు రూ.160 నుంచి రూ.180 వరకు ధర పలుకుతోంది. ఈ నెలలోనూ కందిపప్పు ఇవ్వకపోవడంతో ఇబ్బందుల్లో ఉన్నారు. ఏప్రిల్‌ నెలకు కందిపప్పు సరఫరా కాలేదు. కందిపప్పును మే నెలలో వస్తుందని అంచనా వేస్తున్నారు. కందిపప్పు వచ్చే నెలలో సరఫరా అయితే లబ్ధిదారులకు పంపిణీ చేయిస్తామంటున్నాు అధికారులు. ఈ నెలలో కార్డుదారులకు బియ్యం, పంచదార మాత్రమే ఇస్తున్నారు.

Related Posts
NBK -CBN ‘అన్ స్టాపబుల్’ హైలైట్స్
CBN NBK UNSTOP

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించే 'అన్ స్టాపబుల్' షో నాలుగో సీజన్ ప్రారంభంలోనే పెద్ద మేజర్ సీన్లతో మొదలైంది. ఈ సీజన్ ప్రారంభ ఎపిసోడ్ లో Read more

Bandi Sanjay : కాంగ్రెస్‌ హయాంలో రైతులను ఆదుకున్న దాఖలా లేవు : బండి సంజయ్‌
There is no record of supporting farmers during the Congress regime.. Bandi Sanjay

Bandi Sanjay : బీజేపీ అధ్యక్ష పదవిపై బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. నేను బీజేపీ అధ్యక్ష రేసులో లేనని బాంబ్‌ పేల్చారు బండి సంజయ్. Read more

మోహన్ బాబు క్షమాపణలకు సిద్ధం: సుప్రీం కోర్టు తీర్పు
మోహన్ బాబు క్షమాపణలకు సిద్ధం: సుప్రీం కోర్టు తీర్పు

జర్నలిస్టుపై దాడి కేసులో పోలీసులు ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ఆదేశిస్తూ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టు ఈ రోజు (జనవరి 9) మధ్యంతర ఉపశమనం ఇచ్చింది. Read more

ఈరోజు వైకుంఠ ఏకాదశి.. ఈ పనులు చేయొద్దు!
vaikunta ekadasi 2025

ఈరోజు జనవరి 10, వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాల్లో ఉత్తర ద్వారాలు భక్తుల కోసం తెరుచుకున్నాయి. తిరుపతి, యాదాద్రి, భద్రాద్రి వంటి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×