జగన్, KTR మిత్ర ధర్మాన్ని పాటించారు – RRR

వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిందో బీఆర్ఎస్ MLA కేటీఆర్ కు తెలియకపోయినా ఏపీ ప్రజలకు తెలుసని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు. ఇద్దరూ ఓడిపోయి మిత్ర ధర్మాన్ని పాటించారని మీడియా సమావేశంలో సెటైర్లు వేశారు. రీసెంట్ గా ఢిల్లీ లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మీడియా తో మాట్లాడుతూ..కాంగ్రెస్ , బిజెపి పార్టీ లతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు.

పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా.. జగన్ మోహన్ రెడ్డి ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అయినా వైసీపీ 40 శాతం ఓట్లు సాధించడం మాములు విషయం కాదని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్‌ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి రోజూ జనంలోకి వెళ్లే కేతిరెడ్డి కూడా ఓడిపోవడం ఆశ్చర్యమేసిందన్నారు. జగన్‌ను ఓడించేందుకు షర్మిలను ఒక పావులా ఉపయోగించారని.. అంతకు మించి షర్మిల ఏమీ లేదన్నారు.

ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే రఘురామ రాజు తనదైనా స్టయిల్ లో సెటైర్లు వేశారు. వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిందో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు తెలియకపోయినా ఏపీ ప్రజలకు తెలుసని రఘురామకృష్ణరాజు అన్నారు. ఇద్దరూ ఓడిపోయి మిత్ర ధర్మాన్ని పాటించారని మీడియా సమావేశంలో సెటైర్లు వేశారు. ‘తెలంగాణలో BRS(కేటీఆర్) ఓడితే జగన్ పట్టించుకోలేదు. మీరు మాత్రం ఆయనను ఓదారుస్తున్నారు. వైసీపీ పరాజయం కంటే ముందు తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఆలోచించుకోవాలి’ అని హితవు పలికారు.